Read more!

English | Telugu

ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్ళిన ముకుంద, మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -178 లో.. "మురారి ఎందుకు డల్ గా ఉంటున్నాడు. ఏదైనా బాధ ఉంటే నలుగురితో పంచుకోవాలి కానీ వీడు ఎందుకని ఇలా చేస్తున్నాడని రేవతి బాధపడుతుంది. ఎలాగైనా వాడితో మాట్లాడాలని అదేపనిగా రేవతి అనుకుంటుంది. అప్పుడే కృష్ణ వచ్చి.. అత్తయ్య కాఫీ అని అడుగుతుంది. రేవతి కాఫీ చేస్తుండగా..అత్తయ్య మనం లేచిపోదామా అని తింగరి మాటలు మాట్లాడుతుంటే.. ఏంటి రాత్రి తాగింది ఇంకా దిగలేదా అని రేవతి అంటుంది. అత్తయ్య నేనేం తాగాను అని కృష్ణ అమాయకంగా అడుగుతుంది.. మ్యాంగో జ్యూస్ తాగావ్ లే అని రేవతి అంటుంది. మా మంచి అత్తయ్య మీలానే మీ అబ్బాయి కూడా అంటూ రేవతి చెంపపై ముద్దుపెట్టి కాఫీ తీసుకుని వెళ్తుంది కృష్ణ.

గదిలోకి వెళ్లిన కృష్ణ మురారిని పిలుస్తుంది. మురారి గదిలో ఎక్కడా కన్పించడు. ఏసీపీ సర్ ఎక్కడికి వెళ్ళాడని రేవతి దగ్గరికి వెళ్లి.. ఏసీపి సర్ గదిలో లేరని రేవతికి చెప్తుంది.. మురారి గదిలో లేకపోవడమేంటి.. ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడని రేవతి అంటుంది. మురారి బయటకు వెళ్ళాడు. మురారి తో పాటు ముకుంద కూడా వెళ్ళిందని అలేఖ్య చెప్తుంది. మురారితో ముకుంద వెళ్ళడమేంటి.. ఆ ముకుంద నా కొడుకుని ఎక్కడికి తీసుకెళ్ళింది.

అయిన ఈ మురారి ఏమైనా చిన్న పిల్లాడా ఎందుకు వెళ్ళాడని రేవతి మనసులో అనుకుంటుంది. మురారి, ముకుంద కంగారుగా బయటకు వెళ్లడం నేను చూసానని అలేఖ్య అనగానే.. ఆదర్శ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్‌ తెలిసిందేమోనని రేవతి అంటుంది. అవునయి ఉండొచ్చని కృష్ణ అంటుంది. ఆదర్శ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్‌ తెలిస్తే ముందుగా వాళ్లకు ఎలా తెలిసింది అంటూ అలేఖ్య ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేసరికి రేవతికి కోపం వస్తుంది. దీనికి వాళ్ళ కాపురంలో ఏం జరుగుతుంది వీళ్ళ కాపురంలో ఏం జరుగుతుంది ఇదే కావాలని రేవతి తన మనసులో అనుకుంటుంది.

ఆ తర్వాత ఒంటరిగా అసలు మురారి, ముకుంద ఎక్కడికి వెళ్లారని ఆలోచిస్తుంది. మొదటి నుండి ముకుంద మురారి పట్ల ప్రవర్తించిన తీరుని గుర్తు చేసుకుంటుంది. మరొకవైపు కృష్ణ మురారి గురించి ఆలోచిస్తుంటుంది. కృష్ణ మురారికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచాఫ్ రావడంతో అసలు ఏసీపీ సార్ ఫోన్ ఎందుకు ఆఫ్ లో పెట్టారని కృష్ణ అనుకుంటుంది.. ఆ తర్వాత మురారి గురించి కృష్ణ ఆలోచిస్తుంటే  కృష్ణ వాళ్ళ నాన్న తన ముందుకు వచ్చినట్లు ఉహించుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.