అంత తెల్లగా ఉన్నాయేమిటవి.. నిజమైనవేనా.. ఒక్కసారి ముట్టుకోవచ్చా!
సిక్స్త్ సెన్స్ సీజన్ 5 కి ఈ వారం "దయా" వెబ్ సిరీస్ టీం వచ్చి ఫుల్ సందడి చేసింది. జెడి చక్రవర్తి, ఈషా రెబ్బా, కమల్ కామరాజ్, జోష్ రవి వచ్చారు. ఈ షోలో ఫస్ట్ రౌండ్ అయ్యాక జెడి. చక్రవర్తి, ఈషా రెబ్బ గెలిచారు. వీళ్ళు సెకండ్ రౌండ్ కి వెళ్ళాక ఇద్దరు చీర్ గర్ల్స్ వచ్చి ప్రాపర్టీస్ ని స్టేజి మీద పెట్టారు. అప్పుడు వాళ్ళను చూస్తూ అలాగే ఉండిపోయాడు చక్రవర్తి. "నా క్లాప్స్ సన్నగిల్లాయి.." అని జెడి అనడంతో "ఎందుకని" అని అడిగాడు ఓంకార్.