Read more!

English | Telugu

నచ్చిన అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకుంటా!


హిందీ సీరియల్ కి రీమేక్ ఐన సీరియల్ 'ఎన్నెన్నో జన్మల బంధం'. మాతృత్వానికి దూరమైన ఒక అమ్మాయి సొసైటీలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది అనే కాన్సెప్ట్ తో ఈ సీరియల్ వస్తోంది.  తెలుగు ఆడియన్స్ కి బాగా నచ్చిన సీరియల్.. ఇందులో వేదగా నటిస్తున్న హీరోయిన్ అసలు పేరు డెబిజాన్ మొదక్. ఈమె తనకి సంబంధించిన ఎన్నో విషయాలను ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది.  "నా ఫస్ట్ సీరియల్ కలర్ బంగ్లాలో వచ్చింది "అపాంజాన్" అని...ఇలా నాకు తెలుగులో ఆఫర్ వచ్చేసరికి కొంచెం భయం వేసింది.

ఎందుకంటే లాంగ్వేజ్ తెలీదు కదా. హైదరాబాద్ బిర్యాని అంటే ఇష్టం. హలీం ట్రై చేశా..బాగుంది...ఇకపోతే నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఒకవేళ ఎప్పుడైనా  నచ్చిన అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకుంటాను. మంచి యంగ్ గా కనిపించడానికి కారణం మన ఆలోచనా విధానం. ఎలా ఆలోచిస్తామో మన ఫేస్ కూడా అలాగే కనిపిస్తుంది. ఎలాంటి అబ్బాయి కావాలో ఎప్పుడూ ఆలోచించలేదు. ఇక్కడ ఎండలు అదిరిపోతున్నాయి. నాకు బెంగాలీ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం...ఫిష్ ఎక్కువగా తినడానికి ఇష్టపడతాను. హీరోస్ లో  మహేష్ బాబు, వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ  అంటే ఇష్టం. హీరోయిన్స్ లో  అనుష్క, తమన్నా, రష్మిక అంటే ఇష్టం. ఇది తెలుగులో నా ఫస్ట్ సీరియల్.

లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా సెట్ లో నాకు అందరూ హెల్ప్ చేస్తారు. అలాగే కొన్ని వర్డ్స్ అర్ధం కాకపోయినా యష్ నాకు హిందీలో, తెలుగులో ఎక్ష్ప్లైన్ చేస్తారు. మా ఇంట్లో మా పేరెంట్స్ అంతా నా సీరియల్ చూస్తారు. మా అత్తా వాళ్లకు అర్ధం కానప్పుడు ట్రాన్స్లేట్ చేసి చెప్తూ ఉంటారు. అందానికి సీక్రెట్ ఏమీ లేదు..ఎక్కువగా వాటర్ తాగుతాను. ఏ ప్లేస్ కి వెళ్తే ఆ ప్లేస్ ఉన్న ఫుడ్ ని ఎక్కువగా తింటాను. నాకు మూవీస్ లో ఆఫర్స్ వస్తున్నాయి. కానీ డేట్స్ ప్రాబ్లమ్స్ వలన చేయలేకపోతున్నా.. ప్రస్తుతానికి ఈ ఒక్క సీరియల్ మాత్రమే చేస్తున్నా" అని చెప్పింది వేద.