English | Telugu

ఆ సీన్ చేసేటప్పుడు నితిన్ ఏడ్చేశాడు...సదా కార్ కి యాక్సిడెంట్ అయ్యింది

ఎక్స్ట్రా జబర్దస్త్ షో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఈ షోకి "అహింస" మూవీ నుంచి డైరెక్టర్ తేజ, దగ్గుబాటి అభిరాం వచ్చారు. పటాస్ ప్రవీణ్ అండ్ టీం చేసిన స్కిట్ కి తేజ ఫుల్ నవ్వుకుంటూనే ఉన్నారు. "జయం" మూవీలో నితిన్ నడుముకు తాడు కట్టుకుని దిగే సీన్ ని స్పూఫ్ గా చేసి చూపించారు..ఈ స్కిట్ పూర్తయ్యాక ఆ సీన్ కి సంబంధించిన కొన్ని మెమోరీస్ ని షేర్ చేసుకోమని రష్మీ తేజను అడిగింది. "ప్రియతమా తెలుసునా" సాంగ్ తోనే సినిమా స్టార్ట్ చేసాం. ఆ సాంగ్ చేసేటప్పుడు నితిన్ కి రోప్ కట్టాం మళ్ళీ స్ట్రింగ్స్ కూడా కట్టాం..

వీపు మీద నుంచి కట్టి వేలాడదీస్తూ తియ్యాలి. ఆ సాంగ్ తీసే టైం అయ్యింది. కాని అక్కడ చూస్తే నితిన్ లేడు..మా డాన్స్ మాస్టర్, కెమరామెన్ లేడు. ఎక్కడున్నారా అని వెతికితే సెట్ వెనక వున్నారు వీళ్లంతా. నేను వెళ్లేసరికి నితిన్ ఏడుస్తున్నాడు నేను చేయలేను ఈ డాన్స్ , ఈ మూవీ అని అతను అలా ఏడుస్తుంటే వీళ్లంతా నితిన్ ని సముదాయిస్తున్నారు. ఎన్ని రోజులైనా పర్లేదు అని చెప్పి 12 రోజుల పాటు ఈ సాంగ్ ని షూట్ చేసాం. అలాగే "సబాసి సబాసి సాంగ్ తీసేటప్పుడు నితిన్, సదా ఒక కార్ లో వస్తున్నారు. నితిన్ ఆ కార్ లో ఫ్రంట్ సీట్ లో కూర్చున్నాడు. ఇంతలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి నితిన్ ని దింపేసి ఆయన ఫ్రంట్ సీట్ లో కూర్చున్నాడు. నితిన్ ని వేరే కార్ లో పంపించాడు. ఇంతలో సదా ట్రావెల్ చేస్తున్న కార్ టైర్ బరస్ట్ అయ్యి పల్టీలు కొట్టింది. దాంతో సదాకి బాగా దెబ్బలు తగిలాయి. అందుకే ఆ సాంగ్ మొత్తం సదాని ట్రైన్ లో కూర్చోబెట్టి నటింపచేసాం" అని చెప్పారు డైరెక్టర్ తేజ.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.