English | Telugu

ఈ షోకి కూడా ఆ జడ్జిస్సేనా...బోరింగ్...


నిన్న గాక మొన్న బీబీ జోడి ఇలా పూర్తి చేసుకుందో లేదో "నీతోనే డాన్స్" అనే మరో డాన్స్ షో స్టార్ట్ కావడానికి సిద్ధమైపోయింది. బీబీ జోడిలో అందరూ బీబీ హౌస్ లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చారు. కానీ ఈ "నీతోనే డాన్స్" షోకి మాత్రం సీరియల్ యాక్టర్స్ ని, జబర్దస్త్ కమెడియన్స్ ని తీసుకొచ్చారు. ఇక బీబీ జోడి జడ్జెస్ టీం మాత్రం నిను వీడని నీడను నేనే అన్నట్టుగా ఈ షోకి కూడా కలిసికట్టుగా వచ్చేసారు.. వాళ్ళే అలనాటి అందాల సీనియర్ నటి రాధ, రాను రాను అంటూ తెలుగు ఆడియన్స్ గుండెల్లో ఉండిపోయిన సదా అలాగే తరుణ్ మాస్టర్. ఇక హోస్ట్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..ఆదివారం రాత్రి 9 గంటలకు గ్రాండ్ గా లాంఛ్ కాబోతోంది ఈ షో.

ఇక ఇందులో నిఖిల్ - కావ్య, పవన్-అంజలి, అమర్‌దీప్- తేజస్విని, సందీప్- జ్యోతిరాజ్, శివకుమార్- ప్రియాంకా, నటరాజ్-నీతూ, యాదమ్మ రాజు-స్టెల్లా, సాగర్- దీపా జోడీలు స్టెప్పులేశారు. ఈ షో లాంఛింగ్ కి "టక్కర్" నుంచి హీరో సిద్దార్థ్ ఒక అమ్మాయిని వెంటబెట్టుకొచ్చాడు. "పక్కన ఉన్న అమ్మాయి ఎవరు" అని శ్రీముఖి సిద్దార్థ్ ని అడిగింది. "చూడండి నేను మీ ప్రోగ్రాంకి వచ్చాను...మా ఊర్లో అదితి దేవోభవ అంటారు కదా" అనేసరికి డాన్సర్స్ అంతా గట్టిగా అరిచారు. "నేను వదిలిపెట్టనుగా" అని రాధ అనేసరికి "పెట్టరుగా" అంది కొంటెగా శ్రీముఖి. ఇక ప్రోమో ఎండింగ్ లో నీతోనే డాన్స్ అంటూ రాధ ఒక మత్తైన చూపును ఆడియన్స్ మీదకు విసిరేసింది. ఇక ఈ ప్రోమోని చూసిన నెటిజన్స్ "సేమ్ బీబీ జోడి, జడ్జెస్ ని మార్చి ఉంటే బాగుండేదేమో...బోరింగ్ జడ్జెస్" అంటూ కామెంట్స్ పెట్టారు. ఈ జడ్జెస్ ని చూసేసరికి ప్రతీ ఒక్కరూ బీబీ జోడి అందుకునే అవకాశం కూడా ఉంది. ఇక సరికొత్తగా స్టార్ట్ అవుతున్న ఈ మ్యూజికల్ డాన్స్ షోలో ఎవరెవరు ఎలా చేస్తారో తెలియాలి అంటే నెక్స్ట్ వీక్ నుంచి ఈ షో ఫాలో కావాల్సిందే.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.