Read more!

English | Telugu

డీ బ్యాచ్ కి బుద్ది చెప్పటానికి రంగంలోకి దిగిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -784 లో... కాలేజీలో కేడి బ్యాచ్ లీడర్ అయిన పాండియన్ నాన్న అయినా మురుగన్ కాలేజీ చైర్మన్ విశ్వనాథ్ దగ్గరికి వస్తాడు. కాలేజీలో జరిగే విషయాలు ఏం పట్టించుకోవద్దు.. అది మీకే మంచిదని బెదిరిస్తాడు. 

ఆ తర్వాత అలాగేనా పిల్లలని పెంచేదని చైర్మన్ విశ్వనాథ్ అనగానే.. పిల్లలు ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు. మనం ఆ వయసు నుండే వచ్చిన వాళ్ళం కదా.. నా కొడుకుకు ఈ సిటీలో ఏ కాలేజీ నచ్చలేదు. మీరు ఈ కాలేజీ నుండి పంపించాలని చూస్తే మీకు నా గురించి తెలుసనుకుంట అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. మరొకవైపు క్లాస్ లో కేడి బ్యాచ్ చేసిన అవమానం తట్టుకోలేక ప్రిన్సిపాల్ కి వసుధార జరిగిందంతా చెప్తుంది. ఇప్పటికైనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఇలా ఎంత కాలం వాళ్ళు అలా చేస్తుంటే మిగతా స్టూడెంట్స్ కూడా చెడిపోతున్నారు అంటూ వసుధార అనగానే.. చైర్మన్ కి ప్రిన్సిపల్ ఫోన్ చేసి కేడి బ్యాచ్ వసుధరని అవమానించిన సంగతి చెప్తాడు.

మీరేం టెన్షన్ పడకండి వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అని చైర్మన్ అంటాడు.. ఆ తర్వాత విశ్వనాథ్ కేడి బ్యాచ్ గురించి ఆలోచిస్తుంటే ఏంజెల్, రిషి లు వచ్చి.. ఎందుకు అలా ఉన్నారని అడుగుతారు. అప్పుడు విశ్వనాథ్ కాలేజీ లో ఉన్న సమస్య గురించి చెప్పగానే.. నేను ఒకసారి కాలేజీకి వెళ్తానని రిషి అంటాడు. దానికి విశ్వనాథ్ సరేనని అంటాడు. ఆ తర్వాత రిషి కాలేజీకి వెళ్తాడు. కాలేజీ ముందే ఫుట్‌బాల్ ఆడుతు కేడి బ్యాచ్ ఉంటుంది. రిషిని చూసి కొత్తగా వచ్చిన లెక్చరర్ అనుకుని.. ఈ లెక్చరర్ ని కూడా ఆటపట్టించి అటు నుండి ఆటే వెళ్ళేలా చెయ్యాలని కేడి బ్యాచ్ అనుకుంటారు.

రిషిని పాండియన్ బాల్ ఇవ్వమని అడుగుతాడు. రిషి పొగరుగా బాల్ ని కాల్ తో తన్నగా అది వెళ్ళి కేడి బ్యాచ్ లోని ఒకరికి తగులుతుంది.. అది చూసిన కేడి బ్యాచ్ వీన్ని వదిలి పెట్టొద్దని అనుకుంటారు. రిషి వెళ్తుంటే దార్లో దారం కడుతారు. అది తగిలి రిషి కిందపడాలని అనుకుంటారు. కానీ రిషి ఆ దారాన్ని దాటుకొని వెళ్తాడు. ఆ తర్వాత రిషి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తాడు. ప్రిన్సిపాల్, రిషికి కేడి బ్యాచ్ గురించి చెప్తాడు. మీరేం టెన్షన్ పడకండి.. నేను చూసుకుంటానని రిషి ప్రిన్సిపాల్ కి చెప్పి వెళ్తాడు..

ఆ తర్వాత రిషి వచ్చిన కార్ టైర్ పంచర్ చేస్తారు కేడి బ్యాచ్.. కానీ రిషి కార్ దగ్గరికి వచ్చి పంచర్ చేసింది వాళ్లేనని తెలుస్తుంది.  రిషిని ఎగతాళి చేస్తూ కేడి బ్యాచ్ నవ్వుకుంటారు.. ఆ తర్వాత రిషి పొగరుగా వేరే టైర్ మార్చుకొని వెళ్ళిపోతాడు. కేడి బ్యాచ్ రిషిపై కోపంగా ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.