Read more!

English | Telugu

స్వప్నని కిడ్నాప్ చేయడానికి రాహుల్ స్కెచ్.. కావ్య పసిగట్టేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -118 లో.. స్వప్నతో పెళ్లి జరగకుండా ఉండడానికి రాహుల్ ఒక రౌడీని వెళ్లి కలుస్తాడు. ఆ రౌడీ కి స్వప్న ఫోటో చూపిస్తాడు. ఆ అమ్మాయి నాకు కాబోయే భార్య.. తనతో పెళ్లి నాకు ఇష్టం లేదు. అందుకే నువ్వు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలి.

అలా చేస్తే నీకు పది లక్షలు ఇస్తానంటూ రౌడీకి రాహుల్ చెప్పగానే.. స్వప్న ఫోటో చూసిన ఆ రౌడీ ఇంప్రెస్ అవుతాడు. ఇంత అందమైన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడమా కచ్చితంగా చేసుకుంటా అని రౌడీ చెప్తాడు. కిడ్నాప్ కి కావలిసిన ఏర్పాట్లు అన్ని నేను చూసుకుంటా అని చెప్పేసి రాహుల్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

మరొకవైపు రాత్రి రాజ్ నేల మీద పడుకోవడంతో ఉదయం లేచేసరికి తన మెడ పట్టేస్తుంది. అనవసరంగా గొప్పలకు పోయి ఇలా చేసుకున్నానా అని రాజ్ అనుకుంటాడు. అప్పుడే కావ్య పెళ్ళికి కావలిసిన లిస్ట్ పట్టుకొని రాజ్ దగ్గరికి వస్తుంది. కొద్దిసేపు మెడపట్టేసి ఉన్న రాజ్ ని ఆటపట్టిస్తుంది కావ్య. అప్పడే ధాన్యలక్ష్మి వచ్చి ఏమైందని అడుగుతుంది. కావ్య కావాలనే సిగ్గుపడుతూ రాత్రి అయనకి మెడ పట్టేసిందని చెప్తుంది. అప్పుడు ధాన్యలక్ష్మి నవ్వుతు రాజ్ కి ఆయింట్ మెంట్ రాయి కావ్య అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత రాజ్, కావ్యల దగ్గరికి కళ్యాణ్ వస్తాడు. ఏం జరిగింది అంటూ అడిగేసరికి కావ్య సిగ్గుపడుతుంటే.. ఛీ ఛీ ఆపు అని రాజ్ అంటాడు..ఆ తర్వాత కళ్యాణ్, కావ్య ఇద్దరు కలిసి రాజ్ ని ఆటపట్టిస్తారు. డాక్టర్ కి ఫోన్ చేసి రమ్మని చెప్పు అని కళ్యాణ్ తో రాజ్ అంటాడు. ఈ మాత్రానికే డాక్టర్ ఎందుకు నేను సెట్ చేస్తానని కావ్య అంటుంది. కళ్యాణ్, రాజ్ చేతులు గట్టిగా పట్టుకుంటాడు కావ్య, రాజ్ మెడని ముందుకు వెనక్కి తిప్పుతుంటే రాజ్ భయపడతాడు. ఆ తర్వాత  రాజ్ మెడని సెట్ చేస్తుంది కావ్య.

మరొకవైపు పెళ్లి జరగకుండా ఎలా ఆపాలని రుద్రాణి టెన్షన్ పడుతుంటే.. నువ్వేం టెన్షన్ పడకు మమ్మీ.. పెళ్లి ఆగేలా నేను సెట్ చేశాను. నువ్వు చూస్తూ ఉండు అని రాహుల్ రుద్రాణికి చెప్తాడు. ఆ తర్వాత రాహుల్ దగ్గరికి కావ్య వచ్చి పెళ్లి ఎలా ఆపాలని ఆలోచిస్తున్నావా అని కావ్య అంటుంది. నా జీవితంలో నిన్ను తక్కువగా అంచనా వెయ్యడమే నేను చేసిన పెద్ద తప్పని రాహుల్ అంటాడు. అది కాదు మా అక్కని మోసం చేయడం పెద్ద తప్పని కావ్య అంటుంది. మరొకవైపు కనకం కుటుంబం, దుగ్గిరాల ఇంటికి వెళ్లడానికి రెడీ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.