English | Telugu
చిన్నప్పటి నుంచే ఉందా ఈమధ్యనే మొదలయ్యిందా
Updated : Jun 9, 2023
దీప్తి సునైనా పేరు వినని వారు లేరు. మూవీస్ లో పెద్దగా నటించకపోయినా వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ ఆల్బమ్స్ తో సోషల్ మీడియా లో మోస్ట్ పాపులర్ ఐపోయింది ఈ బ్యూటి. అయితే గతంలో కంటే ఇప్పుడు సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోవడం వలన దీప్తి ఇంకా ఫేమస్ అయ్యింది. ఇన్స్టాగ్రామ్ పేజీలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్స్ ఇస్తూ ఉంటుంది. అలా నెట్టింట్లో సందడి చేస్తోంది. ఇక ఈ క్యూటీకి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. అలాంటి దీప్తి ఇప్పుడు "ఇంటరెస్టింగ్ ప్రశ్నలు ప్లీజ్" అని అడిగేసరికి నిజంగానే ఇంటరెస్టింగ్ ప్రశ్నలు అడిగారు.."మీకు చిన్నప్పటినుంచే పిచ్చా లేదా ఈమధ్య నుంచేనా" అని అడిగేసరికి "అమ్మ పొట్టలో ఉన్నప్పటినుండే" అని కోతి ఎమోజి పెట్టి మరీ కొంటెగా ఆన్సర్ చేసింది . "ఒక్క రోజైనా స్టోరీస్ పోస్ట్ చేయకుండా ఉండరా" అని అడిగేసరికి "అఫ్ కోర్స్ ఎస్" అని ఆన్సర్ చేసింది. "మీ కాలర్ ట్యూన్" ఏమిటి అని అడిగేసరికి "ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా" అంటూ ఆడియో పోస్ట్ చేసింది దీప్తి.
దీప్తి ఇంత ఫేమస్ కావడానికి కొన్ని డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు అని చెప్పొచ్చు. అవి ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఫలితంగా ఈ భామ ఎంతో మందికి క్రష్ ఐపోయింది. చిన్నపిల్లలా కలర్స్ వేస్తూ, క్యూట్ గా నవ్వుతూ రకరకాల ఫోటోషూట్స్ తో ఆడియన్స్ ని అలరిస్తూ ఉంటుంది. షణ్ముఖ్ జస్వంత్ తో ప్రేమాయణం కూడా ఆమెను బాగా పాపులర్ చేసింది. కానీ వాళ్ళ బ్రేకప్ అయ్యాక ఇద్దరికి ఫ్యాన్ ఫాలోయింగ్ కొంచెం తగ్గింది. చాలా రోజులు వీళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారేమో అని నెటిజన్స్ ఎదురు చూసారు. వాళ్ళను కలపడానికి కూడా ఫాన్స్ ఎంతో ప్రయత్నించారు కానీ ప్రయత్నాలు వృధా అయ్యేసరికి ఫాన్స్ కూడా వీళ్ళను కలిపే ప్రయత్నాలను విరమించుకున్నారు.