Read more!

English | Telugu

రెండోసారి తండ్రి అయిన నటుడు విశ్వ

బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ విశ్వా అందరికీ తెలిసిన వాడే... ఒక పక్కన సీరియల్స్ లో మరో వైపు మూవీస్ లో నటిస్తూ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. విశ్వా బిగ్ బాస్ లోకి వెళ్ళే ముందు వరకు సరైన అవకాశాల్లేక ఎన్నో కష్టాలు పడ్డాడు. అక్కినేని నాగార్జున ఫామిలీకి బాగా కావాల్సినవాడు. అక్కినేని  బ్యానర్లో రూపొందిన  ‘యువ’ సీరియల్ లో నటించాడు.  నాగార్జున రెండో కొడుకు అక్కినేని అఖిల్,  విశ్వా క్లాస్మేట్స్. నాగ చైతన్య నటించిన ‘జోష్’ మూవీలో కూడా విశ్వ కనిపించాడు. అలాగే ‘గంగతో రాంబాబు’ అనే సీరియల్ లో నటించి  మంచి పేరు సంపాదించుకున్నాడు.. అలాంటి విశ్వా ఇప్పుడు మరో సారి తండ్రయ్యాడు. రీసెంట్ రెండో కొడుకు పుట్టాడు. ఆ విషయాన్ని తన ఫాన్స్ తో షేర్ చేసుకున్నాడు. దానికి సంబంధించిన వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు.

హాస్పిటల్ నుంచి మొత్తం వీడియోని షూట్ చేసాడు. ఇక విశ్వా పెద్ద అబ్బాయి ర్యాన్ మాత్రం తన తమ్ముడి దగ్గరకు ఎవరినీ రానివ్వకుండా అందరు మాస్కులు వేసుకుని శానిటైజర్ తో హ్యాండ్ వాష్ చేసుకుని చూడాలంటూ వాళ్ళ పిన్ని వాళ్లకు, అత్తలకు, బాబాయిలకు కండిషన్ పెట్టాడు. తన తమ్ముడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దులు పెట్టేసుకున్నాడు..వాళ్ళ అమ్మని హాస్పిటల్ బెడ్ మీద చూసేసరికి "అమ్మ ఆర్ యు ఫైన్" అంటూ ఆమెను అడిగాడు. బిగ్‌బాస్‌ హౌస్ నుంచి బయటకి వచ్చిన విశ్వా అందరిలాగే యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టి తనకి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు. విశ్వా ఫిజిక్ గురించి  బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టినే ఓ సందర్భంలో ప్రశంసలు కూడా కురిపించాడు.