English | Telugu

షిరిడీలో మోసాలు.. జాగ్రత్తగా ఉండాలని చెప్తున్న ఆదిరెడ్డి!

ఆదిరెడ్డి.. బిగ్ బాస్ సీజన్-6 తో ఫేమస్ అయ్యాడు. ఒక కామన్ మ్యాన్ గా, ఒక రివ్యూయర్ గా బిగ్ బాస్ సీజన్-6 లోకి ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి.. తన మైండ్ గేమ్ తో గట్టి పోటీ ఇవ్వటమే కాకుండా, హౌస్ లో మంచి ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చాడు.బిగ్ బాస్ హౌజ్ లో ఆదిరెడ్డికి డ్యాన్స్ రాకపోయినా కానీ హోస్ట్  నాగార్జున డ్యాన్స్ చేయమనగానే చేసేసాడు. అది చూసి అందరూ నవ్వుకున్నారు. బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ అందరి స్క్రీన్ టైం తో పోలిస్తే ఆదిరెడ్డి స్క్రీన్ మీద ఎక్కువగా కనిపించే వాడు. హౌస్ లో ఆదిరెడ్డి ఉన్నప్పుడు ఒక‌ వీక్ లీడర్ అయ్యాడు. కామన్ మ్యాన్ రివ్యూయర్ అయ్యాడు, రివ్యూయర్ టీం లీడర్ అయ్యాడని నాగార్జున చెప్పగానే ఆ వారం  అంతా ఆదిరెడ్డి ట్రెండింగ్ లో ఉన్నాడు.

ఫాదర్స్ డే సందర్భంగా కొంచెం ఎమోషన్, కొంచెం ఫన్

త్వరలో ఫాదర్స్ డే రానున్న సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త ఎపిసోడ్ ని చాల ఎమోషనల్ గా కలర్ ఫుల్ గా తీర్చిదిద్దారు మేకర్స్. అంబటి అర్జున్ హడావిడిగా ఇల్లంతా సర్దుతూ ఉంటాడు "ఏంటన్నా ఏం జరుగుతోంది..ఏంటి ఈ హడావిడి" అని  నూకరాజు అడిగేసరికి  "చానా ఏళ్లకు పాప వస్తోందిరా ఇంటికి" అని చెప్పాడు అంబటి అర్జున్. తన కూతురికి గుర్తుండిపోయేలా ఆమెను ఎంటర్టైన్ చేయడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ మొత్తం కూడా రెడీ అయ్యింది.  లిప్సిక భాష్యం వచ్చి "అమ్మాడి అమ్మాడి" సాంగ్స్ పాడి ఎంటర్టైన్ చేసింది. అమ్మ చేతి గోరు ముద్దలాగా ఇది నాన్న చేసి గోరు ముద్ద అంటూ తండ్రులు తమ పిల్లలకు ఫుడ్ పెట్టే ఒక సెగ్మెంట్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది.

కేడీ బ్యాచ్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -789 లో..మహేంద్ర ఫ్రెండ్ మహేంద్ర ఇంటికి వచ్చి వసుధార అడ్రెస్ తెలిసిందని చెప్తాడు. వసుధార వరంగల్ లోని విష్ కాలేజీ లో లెక్చరర్ గా చేస్తుందని మహేంద్ర ఫ్రెండ్ అంటాడు.  నేను వసుధార దగ్గరికి వెళ్లి రిషి ఎక్కడ ఉన్నాడో కనుక్కుంటాను. అసలు రిషిని కాలేజీ నుండి బయటకు పంపించడానికి గల కారణం తెలుసుకుంటానని మహేంద్ర అంటాడు. నేను కూడా మీతో వస్తానని జగతి అడుగుతుంది. దీనికంతటికి కారణం నువ్వే.. నువ్వు రావొద్దని మహేంద్ర చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

స్వప్నని వెతికే పనిలో రాజ్, కావ్య.. కనకంపై రుద్రాణి ఫైర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -122 లో.. మా అక్కని తీసుకొస్తానంటూ బయటకు వెళ్తుంది కావ్య. రాజ్ నువ్వు కూడా కావ్యకి తోడుగా వెళ్ళమని సీతరామయ్య చెప్పగానే.. రాజ్ వెళ్తాడు. రాజ్ బయటకు వచ్చి మీ అక్క ఇలా ఎందుకు చేసిందని కావ్యని అడుగుతాడు. మీ వల్ల మా ఇంటి పరువు ఏమవుతుందని కావ్యతో రాజ్ అంటాడు. ఇంట్లో వాళ్ళకి మాత్రమే ఈ పెళ్లి జరుగుతున్నట్లు తెలుసు. బయటవారు వచ్చే అవకాశం లేదని కావ్య అనగానే.. అంటే ఈ ఇంట్లో వాళ్ళలో ఒక్కడైన రాహులే ఈ పని చేసాడని నువ్వు అంటున్నావా? ఎప్పుడు వాడిమీదకే ఎందుకు నీ ఆలోచన అని కావ్యని రాజ్ అంటాడు.

 టైం వస్తే ప్రొపోజ్ చేస్తా అన్న కావ్య...

"నీతోనే డాన్స్" గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది. ఇందులో రీల్ అండ్ రియల్ కపుల్స్ వచ్చి మస్త్ పెర్ఫార్మెన్సెస్ చేశారు. నిఖిల్-కావ్య జోడి డాన్స్ మంచి కలర్ ఫుల్ గా సాగింది. జడ్జెస్ కూడా వీళ్ళ డాన్స్ పెర్ఫార్మెన్స్ ని బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత "కావ్యలో మీకు నచ్చేది ఏమిటి" అని శ్రీముఖి నిఖిల్ ని అడిగేసరికి " ఆమె కళ్ళు, నవ్వు" అని చెప్పాడు..అదే ప్రశ్నను కావ్యాన్ని కూడా అడిగింది. "నిఖిల్ హైట్, తన జోవియల్ నేచర్ అంటే ఇష్టం" అని చెప్పింది కావ్య. "ఇన్ని ఇష్టపడే క్వాలిటీస్ ఉన్నప్పుడు ఇంకా కపుల్ ఎందుకు కాలేదు" అని శ్రీముఖి అడిగింది "టైం రావాలి కదా" అని చెప్పింది కావ్య.