English | Telugu

ఎవరికీ కనబడకుండా ముద్దు పెట్టేసారు


కొంతకాలంగా వెన్నెల కిషోర్ హోస్ట్ గా చేస్తున్న కపుల్ షో "అలా మొదలయ్యింది" గురించి అందరికీ తెలుసు. సెలబ్రిటీ కపుల్స్ ను ఈ షోకి పిలిచి వారి గురించి ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను బయటి రాబడుతూ ఉంటారు. అలాంటి షోకి ఈ వారం శివబాలాజీ, అతని భార్య మధుమిత గెస్ట్ లుగా వచ్చారు. ఈ సందర్భంగా ఎన్నోవిషయాలను గుర్తు చేసుకున్నారు. ఇక చివరిలో "నేను నిన్ను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా" అంటూ శివబాలాజీ కిషోర్ ని అడిగాడు. "వామ్మో ఇదేంటి నాకు క్వశ్చనా" అని అడిగేసరికి "అవును నీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి..చాలామంది డిస్టర్బ్ ఐపోతున్నారట..." అని చెప్తూ మంచు విష్ణుకి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసాడు.

" విష్ణు ఇక్కడ నేను వెన్నెల కిషోర్ తో ఉన్నాను..ఈ షోకి పిలిచాడు. నువ్వు ఊరికే అనకయ్యా బాబు. కిషోర్ డబ్బులు తీసుకోకుండానే షో చేస్తున్నాడా" అని విష్ణు అనేసరికి "ముందు ఆయన్ని ఇండియాకి రమ్మని చెప్పు" అన్నాడు కిషోర్. "డబ్బుల్లేకుండా షో చెయ్యమని చెప్పు అతన్ని ముందు" అన్నాడు విష్ణు..'షో అరగంట గ్యాప్ లో అన్నీ అటు విసిరేసి ఇటు విసిరేసి అటు ఇటు వెళ్ళిపోతున్నాడు..టేక్ అనేసరికి నవ్వుతూ మాట్లాడుతున్నాడు" అని విష్ణుకి కంప్లైంట్ చేసాడు శివబాలాజీ.."కిషోర్ మామూలు యారొగెంట్ కాదు.

వాళ్ళ కాలనీలో పెళ్లి కానీ అమ్మాయిలంతా కిషోర్ షూటింగ్ వెళ్లిపోయాకే బయటకి వస్తారు..అంత భయం అతనంటే" అన్నాడు విష్ణు "అయ్యో మీ గురించి కాదు ఇక్కడ చెప్పేది నా గురించి" అన్నాడు కిషోర్ "నా మీద కంప్లైంట్ ఉంటే మా అసోసియేషన్ లో కంప్లైంట్ చేయవయ్యా ...ఎం చేయాలో అప్పుడు చూస్తా" అని ఫన్నీగా అనేసరికి స్పీకర్ ఆన్ చేసి ఉంది జాగ్రత్తగా మాట్లాడండి అన్నాడు కిషోర్. ఇలా ఈ రౌండ్ ఐపోయాక ఫైనల్ ఏడడుగులు అనే రౌండ్ నిర్వహించాడు. అందులో వీళ్ళతో ట్రూత్ ఆర్ డేర్ ఆడించాడు. "మీ లైఫ్ లో జరిగిన మోస్ట్ సినిమాటిక్ మూమెంట్ ఏమిటి" అని కిషోర్ అడిగేసరికి " చెన్నై నుంచి హైదరాబాద్ కి ఫ్లయిట్ లో వస్తున్నాం. ఫ్లయిట్ ల్యాండ్ అయ్యాక బస్సు ఉంటుంది కదా..అందులోకి ఎక్కాం. నిలబడి ఇద్దరం ఒకే పోల్ పట్టుకున్నాం. అంతలోనే సడెన్ గా బస్ కి బ్రేక్ పడింది..అప్పుడు పుచ్చుకుమని ముద్దు పెట్టేసి వెళ్లిపోయారు. ఇలా సినిమాల్లో తప్ప బయట సాధారణంగా జరగదు..బస్సులో అందరూ ఉంటారు కదా.

ఒక్క నిమిషం అలా నా గుండె ఆగిపోయి మళ్ళీ కొట్టుకోవడం మొదలుపెట్టింది. " అని నవ్వుతూ చెప్పింది మధు.."నీ పార్ట్నర్ గురించి ఒక సీక్రెట్ చెప్పాలి" అని అడిగాడు "చాలామందికి శివబాలాజీ అంటే టఫ్ పర్సన్ అని చాలా స్ట్రాంగ్ అన్నట్టుగా కనిపిస్తాడు. కానీ లోపల మాత్రం చాలా సెన్సిటివ్.. ఇంట్లో రిలేషన్స్ విషయంలో అలా కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. ఈ విషయం ఎవరికీ తెలీదు." అంటూ శివబాలాజీ గురించి ఎప్పుడూ చెప్పని ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటి మధుమిత.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.