Read more!

English | Telugu

ఫాదర్స్ డే సందర్భంగా కొంచెం ఎమోషన్, కొంచెం ఫన్

త్వరలో ఫాదర్స్ డే రానున్న సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త ఎపిసోడ్ ని చాల ఎమోషనల్ గా కలర్ ఫుల్ గా తీర్చిదిద్దారు మేకర్స్. అంబటి అర్జున్ హడావిడిగా ఇల్లంతా సర్దుతూ ఉంటాడు "ఏంటన్నా ఏం జరుగుతోంది..ఏంటి ఈ హడావిడి" అని  నూకరాజు అడిగేసరికి  "చానా ఏళ్లకు పాప వస్తోందిరా ఇంటికి" అని చెప్పాడు అంబటి అర్జున్. తన కూతురికి గుర్తుండిపోయేలా ఆమెను ఎంటర్టైన్ చేయడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ మొత్తం కూడా రెడీ అయ్యింది.  లిప్సిక భాష్యం వచ్చి "అమ్మాడి అమ్మాడి" సాంగ్స్ పాడి ఎంటర్టైన్ చేసింది. అమ్మ చేతి గోరు ముద్దలాగా ఇది నాన్న చేసి గోరు ముద్ద అంటూ తండ్రులు తమ పిల్లలకు ఫుడ్ పెట్టే ఒక సెగ్మెంట్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది.

పండుకి చద్దన్నం అంటే చాలా ఇష్టం, మానస్ కి చికెన్ అంటే ఇష్టం, నరేష్ కి ములక్కాయ అంటే ఇష్టం అని చెప్పారు వాళ్ళ వాళ్ళ నాన్నలు. తమ తమ పిల్లలకు తండ్రులు భోజనం పెట్టారు. "పండు ఎలా అనిపిస్తుంది" అని రష్మీ అడిగేసరికి "నాన్న సంవత్సరానికి ఒక్కసారి ఎప్పుడైనా రావొచ్చు..వచ్చి ఒక్క రోజే ఉంటారు. వచ్చి నాకు ఫుడ్ తినిపిస్తారు కదా. ఆ రోజు వేగంగా ఐపోద్దేమో అని భయమేసేది నాకు" అంటూ ఏడ్చాడు పండు. "చాల రోజుల తర్వాత నాకు అన్నం తినిపించావ్ నాన్న నాకు అమ్మ గుర్తొచ్చింది." అన్నాడు. తర్వాత రీతూకి, ప్రవీణ్ కి వాళ్ళ నాన్నల్ని కోల్పోయిన నేపథ్యంలో వాళ్ళ ఇద్దరికీ కూడా భోజనం తినిపించారు.

తర్వాత  తండ్రులకు కళ్ళకు గంతలు కట్టి వాళ్ళ వాళ్ళ పిల్లల్ని కనిపెట్టమంటూ ఒక టాస్క్ ఇచ్చారు. అందరూ కరెక్ట్ గా చెప్పారు కానీ బులెట్ భాస్కర్ వాళ్ళ వాళ్ళ నాన్న మాత్రం వేరే అబ్బాయి చెయ్యి పట్టుకుని తన కొడుకు అని చెప్పేసరికి అక్కడ అంతా ఫన్ క్రియేట్ అయ్యింది. ఇక వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ నాన్నలు ఎంత స్పెషల్ అనే విషయాన్ని చెప్పారు. వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ ని కూడా వాళ్ళ ఫాదర్స్ కి అందించారు.