Read more!

English | Telugu

సుమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్తుందంట!

బుల్లితెర స్టార్ మహిళ సుమ కనకాల‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మాటలతో స్టార్ హీరోలని, డైరెక్టర్ లను సైతం మెప్పిస్తూ యాంకరింగ్ లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఎంతమందిలో ఉన్నా.. ఏ స్టేజ్ మీద అయినా తన మాటలతో మెస్మరైజ్ చేస్తూ అనర్గళంగా మాట్లాడుతుంది సుమ. స్పాంటేనియస్‌ కామెడీ పంచ్ లతో ఎప్పుడు ఆకట్టుకునే సుమ.. సోషల్ మీడియాలో కూడా తన ప్రతిభని కనబరుస్తుంది. తన యూట్యూబ్ ఛానెల్ లోను వీడియోలు చేస్తూ బిజీగా ఉంటుంది సుమ.

సుమ కనకాల.. తన యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి అందులో కొన్ని టిప్స్ ఇస్తూ వీడియోలు కూడా చేస్తుంది. రీసెంట్ గా మహిళల కోసం ఒక వీడియోని చేసి మహిళలకి విలువైన టిప్స్ ని ఇచ్చింది సుమ. తనకు తోచినదే కాకుండా మహిళలకి ఎలా ఉండాలో కొన్ని కొత్త ఐడియాలని ఇస్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది. అవే కాకుండా బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉంటుంది. 

తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో బోటింగ్ కి వెళ్తూ తీసిన ఒక వీడియోని అప్లోడ్ చేసింది. "ఫాస్ట్ బోటింగ్ ఫస్ట్ టైం. అమ్మ బాబోయ్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నాను" అంటూ చాలా భయంగా ఉందంటూ చెప్పింది సుమ. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో బ్రహ్మానందం గారు గుర్తొచ్చారు మేడం అని ఒకరు కామెంట్ చేయగా, కొందరు నెటిజన్లు నవ్వుకుంటున్నారు. మరికొందరు జాగ్రత్త మేడం అంటూ సలహాలు ఇస్తున్నారు. కాగా ఎప్పుడు షూటింగ్స్ తో బిజీగా ఉండే సుమ.. ఇలా వీలు దొరికినప్పుడల్లా కొత్త వ్లాగ్స్ చేస్తూ ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటుంది సుమ. కాగా ఈ వీడియోకి ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక వీక్షకాదరణ లభిస్తుంది.