English | Telugu
స్వప్నని వెతికే పనిలో రాజ్, కావ్య.. కనకంపై రుద్రాణి ఫైర్!
Updated : Jun 15, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -122 లో.. మా అక్కని తీసుకొస్తానంటూ బయటకు వెళ్తుంది కావ్య. రాజ్ నువ్వు కూడా కావ్యకి తోడుగా వెళ్ళమని సీతరామయ్య చెప్పగానే.. రాజ్ వెళ్తాడు. రాజ్ బయటకు వచ్చి మీ అక్క ఇలా ఎందుకు చేసిందని కావ్యని అడుగుతాడు. మీ వల్ల మా ఇంటి పరువు ఏమవుతుందని కావ్యతో రాజ్ అంటాడు. ఇంట్లో వాళ్ళకి మాత్రమే ఈ పెళ్లి జరుగుతున్నట్లు తెలుసు. బయటవారు వచ్చే అవకాశం లేదని కావ్య అనగానే.. అంటే ఈ ఇంట్లో వాళ్ళలో ఒక్కడైన రాహులే ఈ పని చేసాడని నువ్వు అంటున్నావా? ఎప్పుడు వాడిమీదకే ఎందుకు నీ ఆలోచన అని కావ్యని రాజ్ అంటాడు.
ఆ తర్వాత రాజ్ అక్కడున్న కెమెరామెన్ ని పిలిచి కెమెరా తీసుకొని చూస్తాడు. అందులో ప్రతి ఫోటోలో స్వప్న వెనకాలే ఉన్న మైఖేల్ ని రాజ్ చూసి ఇతనే స్వప్నని కిడ్నాప్ చేసి ఉంటాడని అంటాడు. అక్కడే ఉన్న సర్వెంట్ ని పిలిచి మైఖేల్ ఫోటో చూపించి అడుగుతాడు. "వీళ్ళు నలుగురు వచ్చారు సర్.. కాసేపటి నుండి వీళ్ళు కన్పించడం లేదు " అని ఆ సర్వెంట్ చెప్పగానే.. స్వప్నని మైఖేలే కిడ్నాప్ చేసాడని కావ్యకి రాజ్ చెప్తాడు. ఇక ఎలాగైనా మైఖేల్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలని రాజ్ కావ్యలు అనుకుంటారు. మరొకవైపు స్వప్నని కిడ్నాప్ చేసి మైఖేల్ తీసుకెళ్తాడు. స్వప్న మత్తు వదిలి చూసేసరికి తన పక్కన మైఖేల్ ఉంటాడు. ఏంటి నేను ఎక్కడ ఉన్నానని ఆశ్చర్యపోతుంది స్వప్న. అప్పటికే స్వప్నని పెళ్ళి చేసుకోవాలని మైఖేల్ అన్ని ఏర్పాట్లు చేస్తాడు. నన్ను పెళ్లి చేసుకోమని స్వప్నని కత్తితో బెదిరిస్తాడు మైఖేల్. మరొకవైపు రాజ్, కావ్య ఇద్దరు లు స్వప్న వెతుకుతు వస్తారు. ఇక పెళ్ళి దగ్గర ఉన్న రుద్రాణి.. మీ కూతురు మా పరువు తీసిందంటూ కనకంని తిడుతుంటుంది.
మరొకవైపు రాజ్ కి అపర్ణ కాల్ చేసి.. ఎలాగైనా స్వప్నని తీసుకుని రా.. ఇది మన ఇంటి పరువుకి సంబంధించిన విషయమని అపర్ణ అంటుంది. సరే మమ్మీ వెతుకుతున్నామని రాజ్ అంటాడు. ఇప్పుడు కూడా మీ ఇంటి పరువు గురించే ఆలోచిస్తున్నారు. మా అక్క గురించి ఆలోచించడం లేదని కావ్య అంటుంది. మరొక వైపు.. "ఆ రోజు రాజ్ పెళ్ళిలో నుండి కూడా ఇలాగే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇలాగే వెళ్ళింది.. ఇది మీ పెంపకం.. రేపు పెళ్లి అయ్యాక కూడా ఇలాగే చెప్పకుండా పోతే ఎవరిది బాధ్యత. అందుకే ఈ పెళ్లి రద్దు చేసి రాహుల్ పెళ్లి వెన్నెలతో చెయ్యండి" అని రుద్రాణి అంటుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. నీ కొడుకు ఒక అమ్మాయిని తల్లిని చేసాడు. అది మర్చిపోయి నా ఫ్రెండ్ కూతురు కి నీ కొడుకుని ఇచ్చి పెళ్లి చేయమంటావా అని రుద్రాణిని అపర్ణ కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.