English | Telugu

కేడీ బ్యాచ్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -789 లో..మహేంద్ర ఫ్రెండ్ మహేంద్ర ఇంటికి వచ్చి వసుధార అడ్రెస్ తెలిసిందని చెప్తాడు. వసుధార వరంగల్ లోని విష్ కాలేజీ లో లెక్చరర్ గా చేస్తుందని మహేంద్ర ఫ్రెండ్ అంటాడు. నేను వసుధార దగ్గరికి వెళ్లి రిషి ఎక్కడ ఉన్నాడో కనుక్కుంటాను. అసలు రిషిని కాలేజీ నుండి బయటకు పంపించడానికి గల కారణం తెలుసుకుంటానని మహేంద్ర అంటాడు. నేను కూడా మీతో వస్తానని జగతి అడుగుతుంది. దీనికంతటికి కారణం నువ్వే.. నువ్వు రావొద్దని మహేంద్ర చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

మరొక వైపు రిషి దగ్గరికి వసుధార వస్తుంది. ఎందుకు వచ్చావ్ ఇంకా ఏమైనా ఉందా? లేక మీ మేడం పంపించారా అని రిషి అంటాడు. నేను కాదు సర్ మీరే నేను ఉన్న దగ్గరికి వచ్చారని వసుధార అంటుంది. మరి ఇక్కడ నుండి ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నావని రిషి అనగానే.. నేను ఉంటే మీరు ఉండరు కదా సర్.. అందుకే వెళదామని అనుకున్నానని వసుధార అంటుంది.

నా ప్రాణం కాపాడిన విశ్వనాథ్ గారు కాలేజీని మూసివేస్తానని బాధపడటం నాకు నచ్చలేదు అందుకే నేను గతాన్ని మర్చిపోయి ప్రస్తుతం మాత్రమే ఆలోచిస్తున్నా అని ఎవరి గురించో అలోచించి స్టూడెంట్స్ లైఫ్ ని నాశనం చేయలేను కదా అని రిషి అంటాడు. నువ్వు ఒక లెక్చరర్ వి నువ్వు ఎక్కడికి వెళ్ళకు అని రిషి అనగానే.. ఎక్కడికి వెళ్ళనని వసుధార అంటుంది. నేను స్టూడెంట్స్ కి మంచి చెప్పడానికి వచ్చిన లెక్చరర్ ని.. నువ్వు నేను ఎప్పటికి కలవమని రిషి చెప్పి వెళ్ళిపోతాడు. మనం కలవాలని ఉంది కాబట్టి కలిసామని వసుధార తన మనసులో అనుకుంటుంది.

మరొక వైపు కేడి బ్యాచ్ అందరి ముందు రిషి పరువు తియ్యాలని చూస్తారు.అందుకు బెలున్ లో కలర్ నింపి రిషి నిల్చున్న ప్లేస్ లో సెట్ చేస్తారు. అది గమనించిన రిషి క్లాస్ లోకి వచ్చి.. తనకి పైన ఉన్న బెలున్ ని పెన్ తో పగలగొట్టి కేడి బ్యాచ్ కి షాక్ ఇస్తాడు. ఇది ఎవరు చేశారో వాళ్ళు వచ్చి క్లీన్ చెయ్యాలని రిషి అనగానే.. పాండియన్ తన నాన్న మురుగన్ కి ఫోన్ చేసి చెప్తాడు. మురుగన్ కి రిషి వార్నింగ్ ఇచ్చిన విషయం గుర్తుచేసుకొని మీ లెక్చరర్ చెప్పింది చెయ్యండి. మీకు వార్నింగ్ ఇచ్చేకంటే ముందే నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు అని మురుగన్ అనగానే పాండియన్ షాక్ అవుతాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.