English | Telugu
కృష్ణ, మురారిలు కలిసి చేసే పూజని ముకుంద ఆపగలదా!
Updated : Jun 15, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 183 లో... రేవతి ఒక విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తుంటే తన దగ్గరికి సుభాష్ వచ్చి.. ఈ హోమం దంపతుల మధ్య గొడవలు జరుగుతుంటే అవి ఉండకూడదని జరిపిస్తారంట కదా అని అడుగుతాడు. అదేం లేదని రేవతి చెప్తుంది. అప్పుడే అక్కడికి మధు వచ్చి వాళ్ళ నాన్న సుభాష్ ని తక్కువ చేసి మాట్లాడగా.. నీతో మాట్లాడేది ఉంది పదరా అంటూ మధుని పక్కకి తీసుకెళ్తాడు సుభాష్.
ఆ తర్వాత కృష్ణ అంటే తనకి ప్రేమని చెప్పాలనుకుంటాడు మురారి. అదే టైంలో డైరీలో రాసుకున్న ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనుకుంటుంది కృష్ణ. రేవతి అత్తయ్యకి అనవసరంగా వాళ్ళిద్దరిది అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పాను.. ఇప్పుడు తనేమో వాళ్ళిద్దరిది పర్మినెంట్ మ్యారేజ్ చేయాలని చూస్తుందని ముకుంద అనుకుంటుంది. అయితే కృష్ణ, ముకుంద, మురారి కలిసి ఒకే దగ్గర మాట్లాడుకుంటారు. పెళ్ళికి ముందు నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని కృష్ణని ముకుంద అడుగగా.. ఓ లవ్ స్టోరీ చెప్తుంది కృష్ణ. అలాగే "నువ్వు ఆదర్శ్ తో పెళ్ళికి ముందు ఎవరినైనా ప్రేమించావా? ప్రేమిస్తే అతను ఎలా ఉంటాడు" అని ముకుందని కృష్ణ అడుగగా.. అచ్చం మురారిలాగే ఉంటాడని అనగానే కృష్ణ, మురారి ఇద్దరు షాల్ అవుతారు. ఆ తర్వాత ముకందని పక్కకి తీసుకెళ్ళి.. మురారికి పెళ్ళి ముందు లవర్ ఉందా అడుగమని కృష్ణ చెప్తుంది. సరేనని ముకుంద ఒప్పుకొని మురారి దగ్గరికి వచ్చి అడుగగా ఒక్కసారిగా మురారి షాక్ అవుతాడు. మురారి ఏం చెప్పాలా అని తడబడుతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన రేవతి.. మీకు ఇక్కడ ఏం పని, లోపలికి వెళ్ళండని కోపంగా అంటుంది. ఆ తర్వాత మురారి లోపలికి వెళ్ళిపోతాడు.
మరుసటి రోజు ఈ హోమం నుండి ఎలా తప్పించుకోవాలని కృష్ణ ఆలోచిస్తుంటుంది. అప్పుడే కృష్ణ దగ్గరికి రేవతి వస్తుంది. ఏంటమ్మా అని అడుగగా.. అత్తయ్య అని కృష్ణ చెప్తుండగా.. ఆ చీర కట్టుకోలేదంటూ కృష్ణ మాట వినకుండా మాట్లాడేస్తుంది రేవతి. నాకు ఆరోగ్యం బాగోలేదు.. నాకు వేడి పడదు అని సాకులు చెప్తున్న కృష్ణకి.. ఇవేవీ వినను వెళ్ళి కొత్తచీర కట్టుకొని రా అని రేవతి బెదిరిస్తుంది. ఇక చేసేదేమీ లేక కృష్ణ వెళ్తుంది. మరి కృష్ణ, మురారీలతో రేవతి చేపించాలనుకున్న హోమం జరుగుతుందా లేదా అనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.