Read more!

English | Telugu

స్వప్న ఎక్కడుందో తెలుసుకున్న రాజ్, కావ్య!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -123 లో.. ఈ పెళ్లి ఆపేసి నా కొడుకుకి వెన్నెలని ఇచ్చి పెళ్లి చెయ్యండని రుద్రాణి అంటుంది. ఇది ఏమైనా వస్తువు అనుకున్నావా ఒకటి నచ్చకపోతే ఇంకొకటి మార్చుకోవడానికని రుద్రాణిని అపర్ణ కొప్పుడుతుంది. స్వప్నని వెతికి తీసుకొని రావడానికి రాజ్, కావ్య ఇద్దరు వెళ్ళారు కదా.. వచ్చే వరకు ఓపిక పట్టలేవా ఎందుకు అంత తొందర అని రుద్రాణితో సుభాష్ అంటాడు. సూపర్ గా చెప్పావ్ మమ్మీ ఎలాగైనా ఈ పెళ్లి ఆపించేసి వెన్నెలతో నా పెళ్లి జరిగేలా చెయ్యమని రాహుల్ అంటాడు.

మరొకవైప స్వప్నతో తన పెళ్ళికి మైఖేల్ అన్ని ఏర్పాట్లు చేసి పంతులు కోసం ఎదురుచూస్తుంటాడు. పంతులు ఇంకా రాకపోయేసరికి మైఖేల్ పంతులికు కాల్ చేసి త్వరగా రమ్మని చెప్తాడు. మరొకవైపు స్వప్నని వెతుకుంటూ రాజ్, కావ్య ఇద్దరు వస్తారు. అప్పుడే మైఖేల్ ఫోన్ చేసిన పంతులు వస్తుండగా బైక్ పాడై లిఫ్ట్ కోసం చూస్తాడు. అప్పుడే అటుగా వస్తున్న రాజ్ కార్ ని లిఫ్ట్ కోసం ఆపుతాడు. రాజ్ కార్ ఆపి, స్వప్న ఫొటోని  దార్లో ఉన్న అతనికి చూపించి ఎక్కడైనా చూసారా అని అడుగుతుంది కావ్య. అప్పుడు పంతులు ఏమైంది అమ్మ ..ఎవరి గురించి వెతుకుతున్నారని అడుగుతాడు. మా అక్కని ఎవరో కిడ్నాప్ చేశారని, తన గురించి వెతుకుతున్నామని కావ్య అంటుంది. ఒకసారి నాకు ఫొటో చూపించు అని పంతులు అనగానే స్వప్న ఫొటో చూపిస్తుంది కావ్య. ఆ తర్వాత పంతులు దిగవలసిన చోటు రావడంతో పంతులు కార్ దిగి లోపలికి వెళ్తాడు. అక్కడ పెళ్లి కూతురు స్థానం లో ఉన్న స్వప్నని చూసి, ఇందాక నేను కార్ లో చూసిన ఆ ఫోటో లోని అమ్మాయే అని నిర్ధారించుకుంటాడు. ఇక స్వప్న అడ్రస్ వాళ్లకు తెలిసేలా చెయ్యాలనుకుంటాడు పంతులు.

మరొక వైపు కావ్య, రాజ్ లు స్వప్నని ఇంకా తీసుకురాకపోవడంతో రుద్రాణి అనే మాటలకు కృష్ణమూర్తి కనకంలు బాధపడతారు. మరొక వైపు పంతులు మంత్రాలు చదువుతూ మైఖేల్ ని ఇంకా మిగతా వాళ్ళని కళ్లు మూసుకోమని చెప్తాడు. వాళ్ళు కళ్లు మూసుకోగానే  స్వప్నకి ఫోన్ ఇచ్చి మీ వాళ్ళకి కాల్ చెయ్ అంటాడు. అప్పుడు రాజ్ కి స్వప్న ఫోన్ చేసి ఆన్ లో పెడుతుంది. పంతులు మంత్రాలు చదువుతూ రాజ్ కి స్వప్న గురించి తెలిసేలా మాట్లాడుతాడు. అడ్రెస్స్ ని మాంత్రలలాగా చదువుతాడు. అప్పుడు రాజ్ కి మనం లిఫ్ట్ ఇచ్చిన పంతులు మనకి అడ్రెస్ తెలిసేలా చేశాడని స్వప్న దగ్గరికి బయల్దేరి వెళ్తారు. అక్కడికి వెళ్లాక మైకేల్ ని.. నిన్ను ఎవరు కిడ్నాప్ చెయ్యమన్నారని రాజ్ అడుగుతాడు. రాహుల్ పేరు చెప్పకుండా నేనే తనని చాలా రోజులు నుండి ప్రేమిస్తున్నానని అందుకే ఇలా చేసానని మైఖేల్ చెప్తాడు. ఇక రాజ్, కావ్య ఇద్దరు స్వప్నని తీసుకొని అక్కడ నుండి వెళ్తారు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.