English | Telugu

రిషి, వసుధారల మధ్య కొంచెం ఇష్టం కొంచెం కష్టం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -790 లో.. మురుగన్ కి పాండియన్ కాల్ చేసి రిషి గురించి చెప్పగానే.. మీ లెక్చరర్ ఏం చెప్తాడో అది చెయ్యమని మురుగన్ అంటాడు. ఏంటి నాన్న మీరు ఆలా మాట్లాడుతున్నారని పాండియన్ అంటాడు. నా దగ్గరికి నిన్న వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడని చెప్పి, మీరు లెక్చరర్ చెప్పింది చెయ్యండని మురుగన్ ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత రిషికి బయపడిన కేడి బ్యాచ్ టేబుల్ మీద పడిన కలర్ వాటర్ ని క్లీన్ చేస్తూ షేమ్ గా ఫీల్ అవుతారు.

మరొకవైపు రిషి స్టాఫ్ రూమ్ కి వెళ్లగానే.. అందరూ లెక్చరర్లు రిషికి థాంక్స్ చెప్తారు. ఇన్ని రోజులు కేడి బ్యాచ్ చేసే అల్లరి భరించలేకపోయేవాళ్ళం. మీరు వచ్చాక మాకు దైర్యంగా ఉంది. వారికి బుద్ది చెప్తారు అనే నమ్మకం కలిగిందని అక్కడున్న లెక్చరర్లు రిషితో అంటారు. సర్ మీరు మాతో కలిసి ఈ రోజు లంచ్ చెయ్యాలని రిషి సర్ తో అనగానే.. రిషి దానికి ఒప్పుకొని లంచ్ చేయడానికి అందరు కూర్చుంటారు. అప్పుడే వసుధార వస్తుంది. అలా వచ్చి రిషి పక్కనే కూర్చుని ఉంటుంది. రిషి సర్ కి అందరం లంచ్ షేర్ చేస్తున్నాం.. నువ్వు కర్రీ వెయ్ అని మరొక లెక్చరర్ అంటుంది. అప్పుడు వసుధార వైపు రిషి కోపంగా చూస్తాడు. వసుధార ఇబ్బంది పడుతూనే రిషికి కర్రీ ఇస్తుంది. అది తీసుకోవడం ఇష్టం లేని రిషి.. కావాలనే కిందపడేస్తాడు. అది చూసిన వసుధార బాధపడుతుంది. మరొకవైపు రిషి సర్ చేసిన అవమానం తట్టుకోలేక పాండియన్ కోపంతో ఊగిపోతుంటాడు. ఎలాగైనా రిషికి కేడి బ్యాచ్ అంటే ఏంటో తెలిసేలా చెయ్యాలని అనుకుంటాడు.

ఆ తర్వాత రిషి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తుంటే వసుధార ఎదురుగా వస్తుంది. వసుధారని చూసి కోపంగా రిషి.. ఎందుకు ఇలా నా వెంట పడుతున్నావని తిడతాడు. సర్ కావాలనే మీ పక్కన కూర్చొలేదు. మేడం వాళ్ళు కూర్చొమని చెప్తేనే కూర్చున్నానని వసుధార అంటుంది. అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటావ్. ఇక మారవా ఇది నీ వ్యక్తిత్వమంటూ వసుధారపై రిషి కోప్పడుతాడు.. వసుధారతో రిషి మాట్లాడింది పాండియన్ వింటాడు. మరొకవైపు వసుధారని వెతుక్కుంటూ మహేంద్ర కాలేజీకి వస్తాడు.. మహేంద్రని చూసిన రిషి డాడ్ అని పిలుస్తాడు. మహేంద్ర ఒక్కసారిగా వెన్నక్కి చూడగానే.. రిషి కన్పించకుండా వేరే రూమ్ లోకి వెళ్తాడు.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.