Read more!

English | Telugu

లెక్కల రాక డాక్టర్ కాలేకపోయాను.. సూపర్ క్వీన్స్ వన్ డే జాబ్ వెరైటీగా ఉంది...

సూపర్ క్వీన్స్ కి ప్రతీ వారం ఒక్కోరకమైన టాస్క్ ఇచ్చి వాళ్ళతో రకరకాల గేమ్స్ ఆడిస్తున్నాడు ప్రదీప్...ఈ వారం కూడా అలాగే చేసాడు. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.  "ఈ ప్రొఫెషన్ కాకపొతే ఇంకేమన్నా ఇంటరెస్ట్ ఉందా..ఇంకేమన్నా అయ్యేదానివా" అని పవిత్రని ప్రదీప్ అడిగాడు. "నేనేమన్నా అవ్వాలి అనుకుంటే అది హైట్ అవ్వాలి అనుకుంటున్నా ఫస్ట్ " అంది. "అవుతారమ్మగారు మీరౌతారు" అంటూ నవ్వించాడు ప్రదీప్.   ఆనాల సుష్మిత పైలట్ అవ్వాలనుకుందట..తాను గాల్లో ఉంటూ తన చుట్టుపక్కల వాళ్ళను కూడా గాల్లో ఉంచాలనుకుందట. మీరు అవ్వలేరు..లేదంటే ఆ గాల్లో అంతే" అన్నాడు ప్రదీప్. "నాకు డాక్టర్ అవ్వాలంటే ఇష్టం..ఎందుకంటే సర్జరీలు అవి చేయడం ఇష్టం..ఎందుకంటే అవన్నీ నేను పారేసాను. లెక్కలు అస్సలు రాదు" అని విద్యు రామన్ అనేసరికి "డాక్టర్ అవ్వాలంటే లెక్కలు రావాలి" అని ఫన్ చేసాడు ప్రదీప్.

"ఒకవేళ మీరు యాంకర్ అవ్వకపోయి ఉంటే ఏమయ్యే వాళ్ళు" అని పవిత్ర ప్రదీప్ ని అడిగేసరికి "పిచ్చాళ్లకు కొంచెం దూరంగా ఉండేవాడిని" అని చెప్పాడు. మన ప్రొఫెషన్ కాకుండా ఒక్కొక్కళ్ళు ఒక్కో ప్రొఫెషన్ ఒక రోజు చేసి రావాలి అనే టాస్క్ ఇచ్చాడు ప్రదీప్. హోటల్ బేరర్ గా ఎస్తేర్, టిఫన్ కొట్లో వర్కర్ గా మౌనిక, ఫుడ్ డెలివరీ గర్ల్ గా పవిత్ర, చికెన్ అమ్మే అమ్మాయిగా ఝాన్సీ, కిరణ్ షాప్ లో పని చేసే సుహాసిని, కర్రీ పాయింట్ కూరలు ప్యాక్ చేసే అమ్మాయిగా ప్రియాంక, పానీపూరి అమ్మే అమ్మాయి సుష్మిత, ఆటో డ్రైవర్ గా ప్రశాంతి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో కుక్ చేసే అమ్మాయిగా విద్యుల్లేక ఇలా వీళ్లంతా రకరకాల ప్రొఫెషన్స్ లో ఒక రోజు చేశారు. ఆటో డ్రైవ్ చేస్తున్న ప్రశాంతి తన ఆటోలో ఒకతన్ని కిరాయికి ఎక్కించుకుంది. "ఆటో డ్రైవ్ చేసి సంపాదించామని  నాకు సూపర్ క్వీన్స్ లో టాస్క్ ఇచ్చారండి. చాలా ఈజీ ఏమో అని టాస్క్ ఒప్పుకున్నాను. మీకు కష్టమైతే నాకు అదృష్టమండి అన్నాడు కిరాయికి ఎక్కినతను.

లేడీస్ ఆటో డ్రైవ్ చేసేటప్పుడు  అబ్బాయిలకు ఏం అనిపిస్తుంది" అని అడిగింది ప్రశాంతి.."ఏం లేదండి చూస్తూ కూర్చోవచ్చు" అన్నాడు కామెడీగా. ఫైనల్ గా అతను దిగిపోయేటప్పుడు 300 రూపీస్ అయ్యింది ఛార్జ్ అనేసరికి "ఆల్రెడీ నా గుండె మీకు ఇచ్చేసాను మేడం" అన్నాడు. తర్వాత మరో అమ్మాయిని కిరాయికి ఎక్కించుకుని వెళ్తూ ఉండగా సడన్ గా ఆటో దేనినో డాష్ ఇచ్చేసింది. దాంతో అసలు ఏమయ్యిందో అర్ధం కాలేదు. ప్రోమోని ఇక్కడితో ఎండ్ చేసేసారు . మరి అసలు ప్రశాంతికి ఎం జరిగిందో తెలియాలంటే ఆదివారం ప్రసారమయ్యే సూపర్ క్వీన్స్ ఎపిసోడ్ చూడాల్సిందే.