Read more!

English | Telugu

కృష్ణ, మురారీల పూజ మధ్యలో కళ్ళు తిరిగి పడిపోయిన ముకుంద!

స్టార్ మాటీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -184లో..  నువ్వు కోపంలో చాలా అందంగా ఉంటావ్ తెలుసా నీ కోపాన్ని చూసే అదృష్టం నాకు దక్కింది అనివ కృష్ణతో మురారి అంటాడు. బిస్కెట్ వేస్తున్నారా అని కృష్ణ అంటుంది. లేదు కృష్ణ నిజం చెప్తున్నా నవ్వితే ఇంకా బాగుంటావని మురారి అంటాడుమ ఈ మధ్య అత్తయ్య ఏదో విషయం దాస్తూ వింతగా ప్రవర్తిస్తుందని కృష్ణ అనగానే.. మన అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి మా అమ్మకు తెలుసని నీకెలా చెప్పాలి కృష్ణ అని మురారి తన మనసులో అనుకుంటాడు.

ఆ తర్వాత మురారి వెళ్ళిపోయాక కృష్ణకి డైరీ కన్పిస్తుంది. డైరీ చూసిన కృష్ణ మళ్ళీ మురారి మొదటగా ప్రేమించిన అమ్మాయి గురించి చదువుతుంది. మురారి మనసులో వేరే అమ్మాయి ఉందని మళ్ళీ ఆలోచనలో పడుతుంది. ఈ డైరీ చూడడం వల్లే ఏసీపీ సర్ మనసులో ఇంకొక అమ్మాయి ఉందని తెలిసింది. ఈ డైరీ చదవకపోయి ఉంటే  మురారి తో డైరెక్ట్ నా ప్రేమ విషయం అడిగేదాన్ని.. అప్పుడు తన  మనసులో ఏం ఉందో తెలిసేది అని కృష్ణ అనుకుంటుంది.

మరొవైపు మురారి గురించి ముకుంద ఆలోచిస్తుంటుంది. కృష్ణతో కలిసి మురారి హోమం లో కూర్చుంటాడా? నా దురదృష్టానికి బాధపడాలా? కృష్ణ అదృష్టానికి అసూయ పడాలా? ఎక్కడో అడవిలో పుట్టి పెరిగిన తనకి మురారితో కలిసి హోమంలో కూర్చునే అదృష్టం కలిగిందని ముకుంద అనుకుంటుంది. అప్పుడే అలేఖ్య వచ్చి నిన్ను రేవతి అత్తయ్య హోమం దగ్గరికి రమ్మందని ముకుందకి చెప్పి వెళ్తుంది. మరొకవైపు కృష్ణని రెడీ చేస్తూ రేవతి మురిసిపోతుంది. నా కోడలు చూడు ఎంత అందంగా ఉందోనని అంటుంది రేవతి. అప్పుడే కృష్ణ దగ్గరికి మురారి వస్తాడు. అలా మురారి రావడం చూస్తుంది రేవతి. "ఏంట్రా అలా ఉన్నావ్? హోమం చెయ్యడం ఇష్టం లేదా? ఒకవేళ ఇష్టం లేకున్నా చెయ్యాలిసిందే" అని మురారితో రేవతి అంటుంది.

ఆ తర్వాత కృష్ణ, మురారి రెడీ అయి కిందకి వస్తుంటే.. ముకుంద వాళ్ళిద్దరిని చూసి బాధపడుతుంది. మురారి పక్కన ముకుంద ఉండి ఇద్దరు నడిచి వస్తున్నట్లు ఉహించుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ, మురారి  ఒకవైపు, అలేఖ్య,మధులు ఒకవైపు హోమం దగ్గర కూర్చుంటారు. వాళ్ళిద్దరూ కలిసి పూజ చెయ్యడం చూసి  ముకుంద బాధపడుతుంది. కృష్ణ, మురారి హోమం చేస్తూ ఉండగా.. ముకుంద కళ్లు తిరిగి పడిపోతుంది. ముకుంద అంటూ ముకుంద దగ్గరికి వస్తాడు మురారి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.