English | Telugu

వైరల్ అవుతున్న యాంకర్ రవి కొత్త వ్లాగ్!

యాంకర్ రవి.. యాంకరింగ్ లో ఒక ట్రెండ్ సెట్ చేసిన రవి అందరికి సుపరిచితమే. టీవీ షోస్, ఈవెంట్స్ లలో బిజీగా ఉంటోన్న రవి.. ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరగా ఉంటూ వస్తున్నాడు. 'సంథింగ్ స్పెషల్' అంటూ కెరీర్ స్టార్ట్ చేసిన రవి.. ఆ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. అప్పట్లో రవి ఫాలోయింగ్ బాగుండేది. రవి ఆ షో చేస్తుంటే లైవ్ లో తనకి కాల్ చేసి మరీ మ్యారేజ్ చేసుకోమని అడిగేవారు. అప్పట్లో రవికి అంత క్రేజ్ ఉండేది.

ఆ తర్వాత బిగ్ బాస్-5 లో ఎంట్రీ ఇచ్చిన రవికి.. హౌస్ లో పాజిటివ్ ఇంప్రెషన్ కన్నా నెగెటివ్ ఇంప్రెషనే ఎక్కువ వచ్చింది‌. ఏం వచ్చిన ఫేమ్ అయితే వచ్చిందనే చెప్పాలి. రవి ఎంట్రీతో బిగ్ బాస్ విన్నర్ అతనే అని మొదట్లో అనిపించినా.. తను లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అతను బిహేవ్ చేసిన దానికి... అదంతా తలకిందులై.. అనుకోకుండా రవి బయటకొచ్చేసాడు. తను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు జరిగిన ఫ్యామిలీ వీక్ లో.. రవి ఫ్యామిలీ వచ్చినప్పుడు ఎమోషనల్ గా సాగిన ఎపిసోడ్.. మోస్ట్ ఎమోషనల్ ఎపిసోడ్ ఇన్ బిగ్ బాస్ గా చెప్పుకోవచ్చు.

రవి యాంకరింగ్ అంటేనే ఎనర్జిటిక్ గా ఉంటుంది. ప్రేక్షకులను సైతం తన మాటలతో ఉత్తేజపరుస్తాడు. సమ్మర్ వచ్చిందంటే చాలు.. కొందరు సెలబ్రెటీస్.. చిన్న పెద్ద తేడా లేకుండా సమ్మర్ వేకేషన్ అంటూ బయట విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో యాంకర్ రవి కూడా నడుస్తున్నాడు. ఎప్పుడు షోస్, ఈవెంట్స్ తో బిజీగా ఉండే రవి ఈ మధ్య సమ్మర్ వెకేషన్ అంటూ మలేషియా వెళ్ళాడు. దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా, ఆ ఫొటోస్ అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే రవి ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసే కొన్ని పోస్ట్ లకి నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తుంటారు. అందులో నెగెటివ్ గా కామెంట్ చేసేవాళ్ళకి రవి ఘాటుగానే రిప్లై ఇస్తాడు.

రవి వెకేషన్ ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. హైదరాబాద్ నుండి చెన్నై వెళ్ళిన రవి ఫ్యామిలీ.. అక్కడి నుండి శ్రీలంకకి షిప్ లో వెళ్ళారు. అక్కడ సరదాగ గడుపుతున్నట్టుగా దిగిన ఫోటోలని ఎప్పటికప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా, తాజాగా వాటికి సంబంధించిన ఒక వ్లాగ్ ని 'కోర్డెలియా క్రూస్' అనే పేరుతో తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసాడు. యాంకర్ రవు, అతని భార్య కలిసి టైటానిక్ షిప్ లో హీరో, హీరోయిన్ లలా ఫీల్ అవుతూ ఫోజ్ ఇచ్చారు యాంకర్ రవి అతని భార్య‌. కాగా ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.