English | Telugu
శివ్ ది జిమ్ బాడీ..అందుకే డాన్స్ చేయను అని చెప్పా
Updated : Jul 3, 2023
"నీతోనే డాన్స్" ఆదివారం ఎపిసోడ్ లో మరో నాలుగు జంటల మధ్య పోటీ మంచి రసవత్తరంగా సాగింది. ఇందులో ప్రియాంక జైన్- శివ్ ఇద్దరూ కలిసి పంజాబీ స్టయిల్లో డాన్స్ చేశారు. వీళ్ళ డాన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. ప్రియాంక ఫుల్ ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేసింది అని తేజస్విని మార్క్స్ ఇస్తూ మరీ చెప్పింది. అప్పుడు ప్రియాంక ఒక విషయాన్ని ఈ స్టేజి మీద షేర్ చేసుకుంది. "ఐదేళ్ల క్రితం నేను స్టార్ మాలోకి వచ్చాను. స్టార్ మా నన్ను ఇంట్రడ్యూస్ చేసింది. నాకు అమ్ములు, జానకి అనే క్యారెక్టర్లు ఉన్నాయి అంటే అది ఈ స్టేజి వల్లనే. అప్పట్లో ఒక షో వచ్చేది..సీరియల్ సీరియల్ కి మధ్య స్టార్ మా పరివార్ లీగ్ అనే పోటీ ఉండేది.
అలా ఫస్ట్ టైం నేను శివ్ తో కలిసి డాన్స్ పెర్ఫార్మ్ చేసాను. ఆ తర్వాత నేను డైరెక్ట్ గా పిఆర్ దగ్గరకు వెళ్లి శివ్ తో డాన్స్ చేయను, లైఫ్ లో ఎప్పుడూ చేయను అని చెప్పేసాను. ఎందుకంటే అప్పట్లో శివ్ కి జిమ్ బాడీ ఉండేది. బైసెప్స్ ఉండేవి. దాంతో డాన్స్ అసలు చేయలేకపోయేవాడు. ఇప్పుడు జిమ్నాస్టిక్స్ చేసి బాడీని ఫ్లెక్సిబుల్ చేసుకున్నాడు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా గర్వంగా ఉంది శివ్ తో డాన్స్ చేయడం" అని చెప్పింది ప్రియాంక. ఇలా ఈ సండే ఎపిసోడ్ మంచి హుషారుగా సాగింది. మార్క్స్ విషయంలో సాగర్-దీప, ఆట సందీప్-జ్యోతి, ప్రియాంక- శివ్ మధ్య గొడవ జరిగింది కానీ రాధా సర్దిచెప్పారు. ఇక హయ్యెస్ట్ మార్క్స్ తో సందీప్- జ్యోతి జోడి గోల్డెన్ సీట్ లో కూర్చునే ఛాన్స్ కొట్టేశారు. ఈ వారం ఎలిమినేషన్ లేదు కానీ నెక్స్ట్ వీక్ ఉంటుంది అని చెప్పింది శ్రీముఖి.