English | Telugu
ఛేజ్ లు చేసి ఆమెను లేపుకెళ్లి పెళ్లి చేసుకుందామనుకున్నా... కానీ కుదర్లేదు
Updated : Jul 3, 2023
"భాగ్ సాలె" మూవీ జులై 7 న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఆ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ హోస్టింగ్, రాజీవ్ కనకాల కామెడీ స్టేజి మీద నవ్వులు పూయించింది. ఇక రాజీవ్ కనకాలని సుమ ఒక ప్రశ్న వేసింది.."మీ జీవితంలో ఇలాంటి భాగ్ సాలె మూమెంట్లు ఏమన్నా జరిగాయా అని " "పెళ్ళికి ముందు నేను ఆమెతో ప్రేమలో ఉన్నాను. ఐతే పెళ్ళికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు..కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. ఆమెను తీసుకొచ్చేద్దామని అనుకున్నా..అప్పుడు వారాసిగూడాలో ఉండేవాడిని. నేను ఆరోజు రాత్రి చెప్పేసాను...ఒక వేళ ఏమన్నా తేడా కొడితే ఉదయాన్నే ఆ అమ్మాయిని లేపుకెళ్లిపోదాం అనుకున్నా. ఆ రాత్రంతా వారాసిగూడలో చేజ్ లు చేసి, యాదగిరిగుట్టకు వెళ్లాలని, మా అమ్మా నాన్న పెళ్లి చేసుకున్న ప్లేస్ కి వెళ్లి పెళ్లి చేసుకోవాలని ఎన్నో అనుకున్నా.. తెల్లవారాక లేచి చూస్తే ఏముంది... ఆమె పేరెంట్స్ కూడా ఒప్పేసుకున్నారని తెలిసింది.
అక్కడా ఆ భాగ్ సాలె కుదరలేదు. కాకపొతే కేరళ వెళ్ళినప్పుడల్లా భాగ్ సాలెనే..ఎందుకంటే అక్కడ నాకు ఎవరితో మాట్లాడ్డం రాదు. వాళ్ళు మాట్లాడితే అక్కడినుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోవాలి అనుకునేవాడిని. కానీ కుదరలేదండి" అని రాజీవ్ కనకాల అనేసరికి "రాజా ఇప్పుడు నీకు మంచి బాగ్ సాలె మూవ్మెంట్ ని క్రియేట్ చేస్తున్నాను " అంది సుమ ."మా కేరళ సంప్రదాయం ప్రకారం పెళ్లయ్యాక పెళ్ళికొడుకు, పెళ్ళికూతురికి పచ్చి పాలల్లో, పచ్చి అరటిపండు వేసి తినిపిస్తారు..ఆ రోజు ఇది పెట్టినప్పుడు రాజీవ్ గారు మొహం అదోలా పెట్టారు కానీ ఇప్పుడు మీ అందరి సమక్షంలో దాన్ని తినిపించాలి అనుకుంటున్నా" అని చెప్పింది సుమ. "భాగ్ సాలె" అంటే లాగేట్టు బామ్మర్ది, లగెత్తు బావా ఇలా అంటారని ఆ మూవీ టైటిల్ కి అర్ధం చెప్పారు రాజీవ్ కనకాల.