English | Telugu

వసుధారతో ఉండనని మౌనంగా వెళ్ళిపోయిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -805 లో.. ఏంజిల్, విశ్వనాథ్ బయటకు వెళ్తూ.. వసుధారకి ఏమైనా అవసరం ఉంటే చూసుకోమని రిషికి చెప్పి వెళ్తారు.. వసుధార వాటర్ తీసుకోవడానికి ప్రయత్నించి.. బెడ్ మీద నుండి కింద పడిపోతుంది. రిషికి ఏదో శబ్దం వచ్చినట్లు అనిపించి డోర్ దగ్గరికి వచ్చి చూస్తాడు. ఏమైనా అవసరం ఉంటే పిలిచేది కదా అని అనుకుని వెనక్కి వెళ్లిపోయి.. మళ్ళీ కాసేపటికి వసుధార దగ్గరికి వస్తాడు.

రిషి వచ్చేసరికి వసుధార కిందపడిపోయి ఉండడంతో.. ఏమైనా అవసరం ఉంటే పిలువచ్చు కదా అని వసుధారతో రిషి అంటాడు. నేనేం కావాలని పడిపోలేదని వసుధార అనగానే.. నేను అలా అనలేదని రిషి అంటాడు. ఆ తర్వాత వసుధారని రిషి పైకి లేపి బెడ్ పై కూర్చోపెడతాడు. మరొకవైపు మహేంద్ర, జగతి ఇద్దరు ఇంట్లో నుండి బయటకు రావడం ఫణింద్రకి తెలిస్తే కాలేజీకి వస్తాడని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడే జగతి, మహేంద్రల దగ్గరికి ఫణీంద్ర వస్తాడు. ఇలా ఇంట్లో నుండి నాకు చెప్పకుండా ఎందుకు వచ్చారని ఫణింద్ర అడుగుతాడు. కాలేజీలో ఉంటే మిషన్ ఎడ్యుకేషన్ పనులు దగ్గర ఉండి చూసుకోవచ్చని వచ్చినట్టుగా మహేంద్ర అంటాడు. అంతేనా దేవయాని ఏమైనా అన్నదా అని ఫణింద్ర అడుగుతాడు. అదేం లేదని మహేంద్ర అంటాడు. మీరు ఇంటికి వచ్చే వరకు నేను కూడా ఇక్కడే ఉంటాను. మీతో కాలేజీ పనులు చూసుకుంటాను. వెళ్తే అందరం వెళదాం. లేదంటే లేదని ఫణింద్ర అనగానే.. సరే ఇక్కడే ఉండండి అని మహేంద్ర అంటాడు.

మరొకవైపు రిషికి ఏంజిల్ ఫోన్ చేసి.. వసుధారకి టాబ్లెట్స్ ఇచ్చే టైం అయింది. వెళ్లి ఇవ్వు మేం వచ్చేసరికి లేట్ అవుద్దని చెప్తుంది. సరే అని రిషి చెప్తాడు. వసుధార దగ్గరికి రిషి వెళ్ళి టాబ్లెట్ ఇస్తాడు. నాకు బోర్ కొడుతుంది. కంపనీ ఇవ్వగలరా అని వసుధార అనగానే.. కంపనీ, కాఫీ ఇవ్వడానికి నేను మునుపటి రిషిని కాదని రిషి అంటాడు. మీరు అలా ప్రతిసారీ మేడం మేడం అంటుంటే.. నాకు బాధగా ఉంటుంది. మీరు గతం గుర్తు చేసుకోకుండా ఉండడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు అనుకుంటా, మీరు గతం గుర్తుచేసుకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తే మీ చేతికి ఆ బ్రాస్ లైట్ ఎందుకు ఉందని వసుధార అడగ్గానే.. రిషి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడు. మరొకవైపు జగతి, మహేంద్ర ఇద్దరు ఎలాగైనా రిషిని తీసుకొని వచ్చి.. మునుపటి లాగా కాలేజీ బాధ్యతలు అప్పగించాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.