English | Telugu
మీ యూట్యూబ్ వల్లే నా జుట్టు ఊడిపోయింది.. ఐ సపోర్ట్ సోషల్ మీడియా...
Updated : Jul 2, 2023
శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక్కో వారం ఒక్కోలా ఉంటుంది. ఒక వారం ఐతే చాలా సప్పగా సాగుతూ ఉంటే మరో వారం మాత్రం కొంచెం బాగుంది అనిపించేలా ఉంటుంది. కానీ ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా సెగ్మెంట్స్ పెట్టి ఫుల్ టైట్ గా ప్లాన్ చేశారు మేకర్స్. ఇందులో ఒక్కో సెగ్మెంట్ ఒక్కో రేంజ్ లో అలరించింది ఆడియన్స్ ని. అందులో భాగంగా శ్రీవాణితో ఒక స్పెషల్ సెగ్మెంట్ ప్లాన్ చేశారు.
సోషల్ మీడియాలో శ్రీవాణి వీడియోస్ ఎంత ఫేమస్ అవుతూ ఉంటాయో అందరికీ తెలుసు. అలాంటి శ్రీవాణిని పిలిచి యూట్యూబ్ లో వ్లాగ్ చేయాలి అంటే ఏం చేస్తారు అని రష్మీ అడిగేసరికి చేసి చూపించింది శ్రీవాణి. "నేను శ్రీవాణి శ్రీదేవి యూట్యూబ్ ఛానల్ లో వ్లాగ్ చేయడానికి వచ్చేసాను..చాలా మంది సెలబ్రిటీస్ ని శ్రీదేవి డ్రామా కంపెనీలోనే చూసారు కదా..అలాంటి వాళ్లందరినీ ఇప్పుడు ఈ ఛానల్ లో చూడబోతున్నారు. వాళ్లంతా ఎలా రెడీ అవుతారు, ఎలా కూర్చుంటారు, ఎలా చిట్ చాట్ చేస్తూ ఉంటారు, అసలు ఈ సెట్ అంతా ఎలా ఉండబోతోంది అనే విషయాలన్నీ ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను" అని ఇంట్రో చెప్పింది.
అలా చెప్తూ ముందుగా రాంప్రసాద్ దగ్గరకు వెళ్ళింది శ్రీవాణి . "రాంప్రసాద్ గారికి ఏమయ్యింది. ఆయన తలకు ఏం జరిగింది..ఎప్పుడూ కాప్ పెట్టుకుని వస్తారు..అని చాలా మంది ఆడియన్స్ అడుగుతూ ఉన్నారు. అసలు విషయం ఏమిటి అంటే ఆయనకు జుట్టు వచ్చేసింది " అని రాంప్రసాద్ జుట్టుని చూపించింది .."ఐతే నా జుట్టు ఊడిపోవడానికి ఫస్ట్ కారణం మీ యూట్యూబ్ ఛానల్"అనేసరికి అందరూ నవ్వేశారు.
తరువాత సెట్ మొత్తాన్ని షూట్ చేస్తున్న కెమెరాస్ ని, అలాగే పెద్ద క్రేన్ ఇక్కడ ఉంటుంది..అది అన్ని వైపులకు తిరుగుతూ కాప్చర్ చేస్తూ ఉంటుంది అని చెప్పి వాటిని చూపించింది. అలాగే ఇటు వైపు చూస్తే నవ్వు వచ్చినా రాకపోయినా చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఆడియన్స్ అంటూ వాళ్ళను , అలాగే షోకి కావాల్సిన లైట్ బాయ్స్, కాస్ట్ బాయ్స్..ట్రాలీ కెమెరాని అన్నిటినీ చూపించింది.
ఇక ఇంద్రజ దగ్గరకు వచ్చి ఇక్కడ ఒక్కరే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుని అందరి మాటలు వింటూ ఉంటారు అని చెప్పారు శ్రీవాణి. ఇంద్రజ విషయం వచ్చేసరికి నూకరాజు, రాంప్రసాద్ లేచి ఆమెను టీజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక శ్రీవాణికి పోటీగా అందరూ స్టేజి మీదకు ఆండ్రోయిడ్స్ పట్టుకుని వచ్చి యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నట్టుగా నటిస్తూ సరదాగా ఎంటర్టైన్ చేశారు. ఇక శ్రీవాణి చేసిన ఈ వ్లాగ్ షోలో హైలైట్ గా నిలిచింది. "సోషల్ మీడియాని నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రతీ ఒక్క సామాన్యుడిని కూడా చాలా హైలైట్ చేస్తూ ఉంటుంది కాబట్టి నాకు సోషల్ మీడియా అంటే ఇష్టం " అని చెప్పారు ఇంద్రజ.