English | Telugu

యాదమ్మ రాజు- స్టెల్లా మధ్య చిచ్చు పెట్టిన శ్రీముఖి

"నీతోనే డాన్స్" షో శనివారం ఎపిసోడ్ మొత్తం కూడా నటరాజ్ మాష్టర్ ఎపిసోడ్ లా మారిపోయింది. ఆయన కట్టుకొచ్చిన శారీ, లేడీ గెటప్, వయ్యారాలు పోవడంతో అందరూ ఆయనతోనే డాన్స్ చేయడానికి మొగ్గు చూపించారు. ఈ షోలో యాదమ్మరాజు - స్టెల్లా జంట అస్సాం డాన్స్ స్టైల్ ఐన బిహులో "రాధే గోవిందా" సాంగ్ కి డాన్స్ చేశారు. ఐతే వీళ్ళ డాన్స్ కి చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. జడ్జెస్ కూడా పెద్దగా ఇంప్రెస్స్ అవలేదు. ఐతే వీళ్ళ డాన్స్ ఐపోయాక శ్రీముఖి ట్రూత్ ఆర్ డేర్ ఆడించింది. "రీసెంట్ టైమ్స్ లో నీ పార్ట్నర్ దగ్గర నువ్వు దాచిపెట్టిన అబద్దం ఏదైనా ఉందా" అని అడిగింది శ్రీముఖి. "స్టెల్లాకి తెలియకుండా నేను బయటకు వెళ్తూ ఉంటా..సీరియస్లీ జానకి ఐ లవ్ యు..ఎన్నో రోజుల నుంచి చెపుదాం అనుకున్న కానీ పెళ్లి చేసుకున్నా కదా చెప్పలేకపోయా..నువ్వే నా ఫస్ట్ లవ్" అన్నాడు రాజు. వెంటనే స్టేజి మీదకు జానకి అనే అమ్మాయిని పిలిచింది శ్రీముఖి.

ఆమెతో కలిసి డాన్స్ చేసేసరికి స్టెల్లా సీరియస్ ఐపోయింది.."నేను వేరే అమ్మాయితో నిన్ను ఊహించుకోలేను అన్న విషయం తెలుసు కదా. నువ్వు ఆమెను నిజంగా లవ్ చేస్తున్నావా ? మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావ్...ఫొటోస్, వీడియోస్ అన్నీ ఉన్నాయి" అని సీరియస్ గా స్టేజి మీద నుంచి బయటికి వెళ్ళిపోయింది స్టెల్లా... "నువ్వు కూడా అనొచ్చుగా నాకు యదామ్మరాజు వద్దు అని" అని సదా అడిగేసరికి "అదే రోజు వస్తే గనక అప్పుడు తనకు నా బాధేమిటో అర్ధమవుతుంది మేడం" అంది స్టెల్లా. తర్వాత డేర్ లో భాగంగా నటరాజ్ మాష్టర్ తో కలిసి ఒక అద్భుతమైన డాన్స్ చేయాలి అని యాదమ్మ రాజుకి టాస్క్ ఇచ్చింది శ్రీముఖి. ఇక ఆ ఇద్దరూ కలిసి దుమ్ముదులిపేసారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.