English | Telugu
ఆఫీస్ కి తీసుకెళ్తే రాత్రి ఏం జరిగిందో చెప్తానన్న కావ్య!
Updated : Jul 4, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -138 లో.. రాజ్ ని కావ్య ఏం జరిగిందో చెప్పకుండా ఆటపట్టిస్తుంది. కావ్య సిగ్గుపడుతు వెళ్లిపోతుంటే.. నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నానా అని రాజ్ అనుకుంటాడు.
ఆ తర్వాత కావ్య, రాజ్ ఇద్దరు హాల్లోకి వెళ్తారు. అప్పటికే హాల్లో అందరూ రెడీ అయి ఉండడం చూసి.. ఎక్కడికి వెళ్తున్నారని కావ్య అడుగుతుంది. శ్రీశైలం వెళదాం.. మీరు వెళ్లి త్వరగా రెడీ అయి రండి అని సీతారామయ్య అంటాడు. లేదు తాతయ్య నాకు ఆఫీస్ లో అర్జెంటు మీటింగ్ ఉందని రాజ్ అంటాడు. నువ్వు అయిన రా కావ్య అని ఇందిరాదేవి అనగా.. ఆయన రాకుండా నేనెలా వస్తాను. ఆయనకు వంటకి ఇబ్బంది అవుతుందని కావ్య అంటుంది.. చూసావా కావ్య రాకుంటే ఎలా బతిమిలాడుతున్నారో చూసావా? నిన్ను అలా బ్రతిమిలాడేవాళ్ళా అని స్వప్నని రాహుల్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. కావ్య, రాజ్ ఇద్దరు తప్ప అందరూ శ్రీశైలం వెళ్తారు. మరొకవైపు వాళ్ళ నాన్నకి ఎలాగైనా సాయం చెయ్యాలని తన ఫ్రెండ్స్ కి చెప్తుంది అప్పు. ఇప్పుడు క్యాటరింగ్ చేస్తున్నాం కదా.. ఒక ఈవెంట్ చేద్దామని అప్పు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. నాకు తెలిసిన ఈవెంట్ వాళ్ళు సెలబ్రిటీ కోసం చూస్తున్నారు. మీ బావతో నువ్వు మాట్లాడి ఆ ఈవెంట్ కి తీసుకొస్తే మనకి యూజ్ అవుతుందని అప్పు ఫ్రెండ్ అంటాడు. నాకు అలా ఇష్టముండదని అప్పు అంటుంది. మీ అక్కతోనే సరిగా మాట్లాడడు ఇంకా నీతో మాట్లాడతాడా? ఆ ఇంట్లో మీ అక్క పని మనిషి అట కదా అని అప్పు ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడేసరికి.. అప్పుకి కోపం వస్తుంది. తన ఫ్రెండ్ రాకేష్ ని బ్యాట్ తో తల మీద కొడుతుంది. దాంతో రాకేష్ కిందపడిపోతాడు. అప్పుని తన ఫ్రెండ్ అక్కడ నుండి తీసుకొని వెళ్తాడు.
మరొక వైపు రాజ్ ఆఫీస్ కి రెడీ అయి వెళ్తుంటే.. నేను కూడా వస్తానని కావ్త చెప్తుంది. అవసరం లేదని రాజ్ అనగానే.. రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవాలని లేదా అని కావ్య అంటుంది. ఏం జరిగింది చెప్పమని రాజ్ అంటాడు. నన్ను ఆఫీస్ కి తీసుకొని వెళ్తే చెప్తానని కావ్య అనగానే.. సరే మంచి చీర కట్టుకొని రా అని రాజ్ చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు ఆఫీస్ కి బయల్దేరుతారు. మరొక వైపు రాకేష్ గురించి టెన్షన్ పడుతుంది అప్పు. అప్పుడే కనకం వచ్చి అప్పుతో మాట్లాడుతుంది. ఎందుకు టెన్షన్ పడుతున్నావని కనకం అడుగుతుంది. ఏం లేదని అప్పు పంపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.