English | Telugu

శివబాలాజీ, మధుమిత ఢిల్లీ ట్రిప్ లో దోసకాయ మటన్!

మధుమిత.. ఆమె అసలు పేరు స్వప్న మాధురి. దక్షిణాది సినిమాలలో ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువగా సహాయ పాత్రలు పోషించింది. పుట్టింటికి రా చెల్లీ, మన్మథుడు వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రముఖ నటుడు శివ బాలాజీని పెళ్లిచేసుకుంది.

మధుమిత స్వప్నమాధురి అనే పేరుతో 2002 లో విడుదలైన సందడే సందడి అనే చిత్రంలో ముఖ్యమైన సహాయపాత్రతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించింది. తరువాత మన్మథుడు, అమ్మాయిలు అబ్బాయిలు, పుట్టింటికి రా చెల్లి లాంటి సినిమాలలో సహాయపాత్రలు చేసింది. అర్జున్ కు చెల్లెలుగా నటించిన పుట్టింటికి రా చెల్లీ సినిమా 275 రోజులు ఆడి సంచలన విజయాన్ని నమోదు చేసింది. తరువాత ఆమెను కుడైకుళ్ మళై అనే సినిమాతో పార్తిబన్ తమిళ సినీపరిశ్రమకు పరిచయం చేశాడు. ఈ సినిమాలో ఆమె కథానాయికగా నటించింది. ఆ పాత్ర పేరైన మధుమిత ను తన అసలు పేరుగా మార్చుకున్నది. ఆ సినిమా పెద్దగా విజయవంతం కాకపోయినా ఆమెకు తమిళంలోనే మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఆముదే, ఇంగ్లిష్ కారన్ అనే తమిళ సినిమాల్లో నటించింది.

కాగా మధుమిత, శివబాలాజీ కలిసి సొంతంగా 'శివమధు' అనే ఒక యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేశారు. అందులో కుకుంగ్ వీడీయోస్, ట్రావెల్ వ్లాగ్స్ చేస్తూ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నారు మధు, శివబాలాజీ దంపతులు. కాగా తాజాగా వాళ్ళు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ నుండి ఆగ్రాకి వెళ్ళే హైవేలో ఒక దాబాలో ఆగి.. వాళ్ళు ఇంట్లో చేసుకున్న దోసకాయ మటన్ కర్రీని అందరూ కలిసి తిన్నారని మధుమిత చెప్పింది. కాగా ఈ ట్రావెల్ వ్లాగ్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.