English | Telugu

కాబోయే వాడు ఆమె మాట వినాలి... ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళకూడదు

"నీతోనే డాన్స్" షో శనివారం ఎపిసోడ్ మంచి మంచి డాన్స్ స్టైల్స్ తో అలరించింది. ముందుగా కావ్య-నిఖిల్ జోడి గర్భ-దాండియా డాన్స్ స్టైల్స్ తో ఒక మ్యాజిక్ చేద్దామనుకున్నారు కానీ ఈ వారం మాత్రం ఎందుకో వీళ్ళ డాన్స్ తేలిపోయింది. జడ్జెస్ కూడా చాలా నిరాశకు గురయ్యారు. ఇక అంజలి-పవన్, నటరాజ్ మాస్టర్-నీతూ జోడీస్ 6 మార్కులు ఇస్తే యాదమ్మరాజు-స్టెల్లా జోడి మాత్రం 7 మార్క్స్ ఇచ్చారు. ఇక ఈ షోలో ఉన్న జోడీస్ తో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ కూడా ఆడించింది శ్రీముఖి.. అందులో భాగంగా నిఖిల్ ట్రూత్ ఎంచుకునేసరికి "మీరు ఎలాగో ఏమీ చెప్పరు కాబట్టి కావ్యకి ఒక హజ్బెండ్ వస్తే ఆ అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పండి" అని అడిగింది శ్రీముఖి. "తనకు రాబోయే హజ్బెండ్ తన మాట వినాలి..

ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళకూడదు..తనకు కంఫర్ట్ గా ఉన్న మనిషితో తప్ప మిగతా వాళ్ళతో టైం స్పెండ్ చేయదు..ఆమెకన్నా కొంచెం హైటె ఉండాలి" అని చెప్పాడు నిఖిల్. "కంపాటబిలిటీలో ఎన్ని మార్క్స్ ఇస్తావ్" అని కావ్యను అడిగింది శ్రీముఖి. "9 మార్క్స్ ఇవ్వొచ్చు..." అని కావ్య అనేసరికి "ఫ్రెండ్స్ తో వెళ్తాడని ఒక మార్క్ తగ్గించావ్ కదా" అని శ్రీముఖి రెచ్చగొట్టేసరికి "వాడు వెళ్ళడు బయటకు" అని చెప్పేసరికి "కావ్య ఒక్కసారి స్టార్ట్ చేస్తే అన్ని నిజాలే చెప్పేస్తుంది" అంది..తర్వాత కావ్యకి డేర్ ఇచ్చింది. "మీ ఇద్దరూ ఒక ఫోటో దిగి వి ఆర్ కమిటెడ్ అని పెట్టాలి" అనేసరికి కావ్య అలాగే చేసేసింది. ఫోటో పోస్ట్ చేసి "హ్యాపీలి కమిటెడ్ టు వన్ అండ్ ఓన్లీ నిఖిల్ " అని వాళ్ళ ఇద్దరి పిక్ ని పోస్ట్ చేసేసింది కావ్య..