English | Telugu

ఈ షో సంతకం లేకుండా కళాకారులు చెలామణి అవ్వడం ఈజీ కాదు!

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతీ వారం లాగే ఈ వారం కూడా బాగా ఎంటర్టైన్ చేసింది. ఇక ఇందులో సింగర్ బేబీ పాడిన పాటలు వేరే లెవెల్ లో ఉన్నాయి. ఆమె పాడిన పాటలకు సెట్ మొత్తం ఊగిపోయింది. ఇక ఇంద్రజ ఎనెర్జీ మాములుగా లేదు. స్టేజి మీదకు వచ్చి ఆమెను పట్టుకుని ఊపేసింది. యాదమ్మ రాజు-స్టెల్లా కలవడం కోసం కూడా స్పెషల్ గా ఒక జానపదం పాడి అలరించారు బేబీ . "చిలుక ఎందుకె అలక" అనే సాంగ్ ని పాడారు. ఐతే ఈ సాంగ్ రాసిన బాబు అనే రైటర్ ని కూడా స్టేజి మీదకు పిలిచారు. తర్వాత సాంగ్ రైటర్ బాబు మాట్లాడుతూ "అందరికీ నమస్కారమండి. కరెన్సీ నోట్ 5 రూపీస్ ఐనా 500 రూపీస్ ఐనా గవర్నర్ గారి సంతకం గాంధీ గారి బొమ్మ లేకుండా చెలామణి అవ్వదు..అలాగే నూతన కళాకారుడు సోషల్ మీడియాలో ఫేమస్ ఐనా అవ్వకపోయినా శ్రీదేవి డ్రామా కంపెనీ వారి సంతకం లేకుండా చెలామణి అవ్వడం అంత ఈజీ కాదు.. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్" అని చెప్పాడు ..

ఇక రష్మీ ఎవరెవరికి ఎలాంటి సాంగ్స్ డేడికేట్ చేస్తారు అని అందరినీ అడిగింది. "ప్రియా ప్రియతమా అందాలు" అనే సాంగ్ ని నా వైఫ్ ప్రీతీకి డేడికేట్ చేస్తానని అని చెప్పారు నగేష్. "ఎటో వెళ్ళిపోయింది మనసు" అనే సాంగ్ ని డేడికేట్ చేస్తానన్నారు సాయి రోనాక్. "ప్రియతమా నీవచట" అనే సాంగ్ ని డేడికేట్ చేస్తానన్నారు అభిలాష్. "ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే" అనే సాంగ్ ని మా విక్రమ్ కి డేడికేట్ చేస్తానని చెప్పింది శ్రీవాణి. "నిండు నూరేళ్ళ సావాసం" అనే సాంగ్ ని సిద్దుకి డేడికేట్ చేస్తాను అని చెప్పింది విష్ణుప్రియ. "కోటి కోటి తారల్లోన" అనే సాంగ్ ని నా వైఫ్ కి డేడికేట్ చేస్తాను అని చెప్పాడు బుల్లితెర నటుడు ప్రియతమ్. "సముద్రమంత నా కన్నుల్లో" అనే సాంగ్ ని నా హజ్బెండ్ కి డేడికేట్ చేస్తున్నా అని చెప్పారు ఇంద్రజ.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.