English | Telugu

'నీతోనే' షార్ట్ ఫిల్మ్ లో బ్రహ్మముడి కళ్యాణ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ గుప్పెడంత మనసు, బ్రహ్మముడి. బుల్లితెర టీవీ సీరియల్స్ లో ఈ సీరియల్స్ కి ఉండే క్రేజ్ మాములుగా లేదు. అందులోను గుప్పెడంత మనసు సీరియల్ కి ఫ్యాన్ బేస్ చాలానే ఉంది. కొత్తగా వస్తున్న సీరియల్ కోసం గుప్పెడంత మనసు సీరియల్ టైం స్లాట్ మార్చొద్దని, పెద్దఎత్తున ట్రెండింగ్ క్రియేట్ చేశారు సీరియల్ ఫ్యాన్స్. స్టార్ మా యాజమాన్యానికి మెసెజ్, కాల్స్ కూడా చేశారు. ప్రస్తుతం బ్రహ్మముడికి, గుప్పెడంత మనసుకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే రెండింటిలోను కథ బాగుంటుంది. అందులో రిషి-వసుధార, ఇందులో రాజ్-కావ్య.. ఆన్ స్క్రీన్ పై ఈ రెండు జంటల మధ్య బాండింగ్, లవ్ వల్లే ఈ రెండింటికి అంత క్రేజ్ లభిస్తుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.

అయితే ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ టీఆర్పీలో లో‌ నెంబర్ వన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ సీరియల్ లో రాజ్ కి తమ్ముడిగా చేస్తోన్న కళ్యాణ్ అలియాస్ కిరణ్ ప్రేరణి కవిగా అందరికి సుపరిచితమే.. ప్రతీ సీన్ లోను కళ్యాణ్ తన కవిత్వంతో తెలుగుని బ్రతికిస్తూ.. చుట్టూ ఉండేవారికి విసుగు తెప్పిస్తున్నట్టుగా మాట్లాడుతుంటాడు. దీంతో ఈ సీరియల్ లోని కావ్య కూడా కళ్యాణ్ ని 'కవి గారు' అని పిలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ బ్రహ్మముడి కవిగారు కొత్తబాట పట్టినట్టున్నారు. కళ్యాణ్ అలియాస్ కిరణ్ బ్రహ్మముడి సీరియల్ లో.. సాటి మనిషిగా ఇతరులు పడే కష్టాలు అర్థం చేసుకుని, తనకి చేతనైన సాయం చేస్తున్న కళ్యాణ్.. ఈ పాత్రలో ఒదిగిపోయాడు.

కిరణ్ 'నీతోనే' అనే లఘుచిత్రంలో నటించాడు. తాజాగా దానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. అలుగంటి ఫిల్మ్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ లఘుచిత్రంలో కిరణ్ కాంత్, రసజ్ఞ్య రితూ, అభిరామ్ అలుగంటి ముఖ్య పాత్రల్లో చేస్తున్నారు. అయితే ఇదే కిరణ్ మొదటి షార్ట్ ఫిల్మ్ అని తెలుస్తుంది. ఇందులో రాజ్ పాత్రలో కన్పిస్తున్న కిరణ్.. తన లవ్ ఎలా మొదలైందో.. ఫస్ట్ లవ్ లో ఉండే ఫీల్ ఎలాంటిదో చెప్తూ.. అలా ముగించేశాడు. దీంతో ఈ లఘుచిత్రంపై మరింత ఆసక్తి పెరిగింది. బ్రహ్మముడిలో కవిగా చేస్తున్న కళ్యాణ్.. 'నీతోనే' లఘుచిత్రంలో రాజ్ పాత్రలో ఎలా చేశాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.