English | Telugu
బిగ్ బాస్ డేట్ ఫిక్స్.. జబర్దస్త్ కమెడియన్ ఎంట్రీ!
Updated : Aug 8, 2023
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7కు సంబంధించిన సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. వివరాలను ముందుగా బయట పెట్టరు. అయితే లీకులు మాత్రం బయటకు వచ్చేస్తుంటాయి. తాజాగా బిగ్ బాస్ 7 తెలుగుకి సంబంధించిన నిర్వాహకులు హైప్‌ను క్రియేట్ చేయటానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. సీజన్ 6, బిగ్ బాస్ ఓటీటీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో సీజన్ 7పై ముందు నుంచే స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. కాస్త తెలిసిన ముఖాలను బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకు రావటం అనేది ఆ ప్లానింగ్‌లో భాగమని తెలుస్తోంది. అందులో భాగంగా ఓ జబర్దస్త్ కమెడియన్‌ని హౌస్‌లోకి రప్పిస్తున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
బయట మీడియా సర్కిల్స్‌లో వినిపిస్తోన్న వార్తల మేరకు బిగ్ బాస్ 7 తెలుగులోకి అడుగు పెట్టబోతున్న జబర్దస్త్ కమెడియన్ ఎవరో కాదు.. అప్పారావు. నాటకాల్లో నటించిన అప్పారావు జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. అక్కడి నుంచి సినీ రంగ ప్రవేశం కూడా చేసిన సంగతి తెలిసిందే. చిన్నా చితకా పాత్రలు చేస్తూ దాదాపు రెండు వందలకు పైగానే సినిమాల్లో నటించి మెప్పించారు. తనదైన కామెడీ టైమింగ్‌తో మెప్పిస్తూ వచ్చిన అప్పారావు రీసెంట్‌గానే జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చేశారు. తనకు ప్రాధాన్యత తగ్గించటం వల్లనే తాను షో నుంచి బయటకు వచ్చానని ఆయన పేర్కొన్నారు.
ఇప్పుడు సినిమాలపైనే ఫోక్ చేసిన అప్పారావు.. బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తే.. ఎలా ఆకట్టుకుంటారనేది అందరినీ ఆలోచింప చేస్తోన్న విషయం. ఇక జబర్దస్త్ సీజన్ 7 ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందనే దానిపై కూడా ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మీడియా సర్కిల్స్‌లో వైరల్ అవుతోన్న న్యూస్ ప్రకారం సెప్టెంబర్ 3 నుంచి సీజన్ 7 షురూ అవుతుందని టాక్.