English | Telugu
సందీప్ కొంచెం ఎదుగు..అంత స్ట్రాటజీ ప్లే చేయాల్సిన అవసరం లేదు
Updated : Aug 8, 2023
"నీతోనే డాన్స్" షో ఈ వారం ఇంకా ఎక్కడా కాంట్రోవర్సి కంటెంట్ రాలేదు అంటుకుంటున్న టైంలో గొడవ జరిగిపోయింది. అమరదీప్ - తేజు - అభినయశ్రీ ముగ్గురూ కలిసి అడవిలో జంతువుల్ని మనుషులు ఎలా చంపేస్తున్నారో చెప్తూ ఒక మంచి పెర్ఫార్మెన్స్ చేసి చూపించారు. వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూసాక జడ్జెస్ అందరూ ఫిదా ఇపోయారు. యానిమల్ లవర్ ఐన సదా కన్నీళ్లు పెట్టేసుకున్నారు. ఇక మార్క్స్ ఇచ్చేటప్పుడు సాగర్, ఆట సందీప్ మధ్య కాసేపు గొడవయ్యింది. "నా పెర్ఫార్మెన్స్ లో ఒక మూవ్మెంట్ తప్పొచ్చిందని మార్క్ కట్ చేశారు మరి అమరదీప్ వల్ల పెర్ఫార్మెన్స్ లో కూడా ఒక సందర్భంలో కంటెస్టెంట్ పడిపోయారు..మరి ఎందుకు ఫుల్ మార్క్స్ ఇచ్చారు" అని సందీప్ సాగర్ ని క్వశ్చన్ చేసేసరికి.."నాకు ఇవ్వాలనిపించింది ఇచ్చాను" అని సాగర్ చెప్పేసారు..ఇక మధ్యలోకి రాధ ఎంట్రీ ఇచ్చారు .."సందీప్ కాస్త ఎదుగు..నీకు ఇంతకు ముందు ఈ విషయం గురించి చెపుదాం అనుకున్నా..కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా.
మీ జోడికి, అమరదీప్ జోడికి మధ్యన చిన్న గొడవ ఉంది. మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు..లాస్ట్ వీక్ పెర్ఫార్మెన్స్ లో అమర్ దీప్ వాళ్లకు 9 మార్క్స్ ఇచ్చే అవసరం లేదు..కానీ మీరు ఇచ్చినట్టు అనిపించింది. కానీ ఇప్పుడు వేరే వాళ్ళు చేస్తే మీరు ఆ విషయాన్నీ వేలెత్తి చూపిస్తున్నారు. స్ట్రాటజీ ప్లే చేయొచ్చు.. కానీ కొన్ని పెర్ఫార్మెన్సెస్ లో అసలు తప్పులు వెతకాల్సిన అవసరం లేదు" అని చెప్పారు. మళ్ళీ వాళ్ళెక్కడ సీరియస్ అవుతారో అని రాధ మళ్ళీ వాళ్ళను బుజ్జగించే ప్రయత్నం చేశారు. "డాన్స్ లో ఇవన్నీ కామన్..నేను చెప్పానని ఎవరూ ఫీల్ అవకండి. మళ్ళీ మళ్ళీ మీరు ఇలాంటి అస్సలు చేయకండి" అని గట్టిగా నవ్వేశారు రాధ. బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ది డేకి అమరదీప్-తేజు నిలిచారు. అలాగే గోల్డెన్ సోఫాలో కూర్చునే ఛాన్స్ కొట్టేశారు.