English | Telugu

షోలో కన్నీళ్లు పెట్టుకున్న ఇంద్రజ...ఇన్నాళ్లు ఇది నేను మిస్ అయిపోయానా..

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోలో ఎవరు హైలైట్ ఐనా కాకపోయినా ఇంద్రజ మాత్రం తన కామెంట్స్ తో, తన సెటైరికల్ డైలాగ్స్ తో మంచి కామెడీ చేస్తూ ఉంటారు. అలాంటి ఇంద్రజ ఈ షోలో ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. కానీ నెక్స్ట్ వీక్ ప్రోమోలో మాత్రం ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ షోలో ఆమె చేసిన క్లాసికల్ డాన్స్ కి ఎందరో ఫిదా ఇపోయారు. ఆ డాన్స్ ఐపోయాక ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. "ఈ కాస్ట్యూమ్ నేను వేసుకున్నప్పుడు చెప్పలేదు కానీ..నాలో ఏదో ఆనందం పొంగుతోంది. ఇన్నాళ్లు ఇది నేను మిస్ అయిపోయానా" అంటూ.. గుక్క పెట్టి ఏడ్చేశారు. ఇంద్రజ ఎమోషనల్ అయిన తీరుతో అక్కడ అందరూ కూడా ఫీలైనట్టు కనిపించింది.

తర్వాత "బోలా శంకర్" మూవీ డైరెక్టర్ మెహర్ రమేష్ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన ముందు రష్మీ స్టెప్స్ వేసేసరికి "నేను స్టెప్స్ మెగాస్టార్ తో ఐనా నీతో ఐనా వేయిస్తాను" అని చెప్పా కదా అన్నారు. దానికి రష్మీ సిగ్గుపడిపోయింది. ఇక మానస్ అల్లూరి సీతారామరాజు గెటప్ తో వచ్చి స్కిట్ పెర్ఫార్మ్ చేసాడు. తర్వాత ఆటో రాంప్రసాద్ సుభాష్ చంద్రబోస్ గెటప్ లో వచ్చారు. ఆగష్టు 15 రాబోతున్న సందర్భంగా ఫ్రీడమ్ ఫైటర్స్ గెటప్స్ లో వచ్చి అందరూ అలరించారు. ఈ ప్రోమోకి నెటిజన్స్ కామెంట్స్ చూస్తే మాములుగా లేవు "మనకు స్వతంత్రం తీసుకొచ్చి ప్రాణాలర్పించిన మహానుభావులను గుర్తు చేసినందుకు శ్రీదేవి డ్రామా కంపెనీకి బిగ్ థాంక్స్ ..ఇంద్రజ గారి డాన్స్ సూపర్..మాటల్లేవ్..ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ తర్వాతనే ఎవరైనా" అంటూ కామెంట్స్ చేశారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.