English | Telugu
వాళ్ళిద్దరి మధ్య ఏం లేదని అనుకుంటున్న నందు!
Updated : Aug 8, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -229 లో.. కృష్ణ, మురారీలని తీసుకొని రండి అని భవాని ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. ఒక వైపు కృష్ణని తీసుకొని, మరొకవైపు మురారి ని తీసుకొని కిందకి వస్తుంటారు. నా మొదటిసారి పెళ్లి మా నాన్న వల్ల జరిగింది. అప్పుడు మా నాన్న దూరం అయ్యారు. ఇప్పుడు రెండవ సారి మళ్ళీ జరుగుతుంది. ఇప్పుడు ఏసీపీ సర్ నేను దూరం అవుతారు. మురారి కూడా కృష్ణ గురించి ఆలోచిస్తుంటాడు.
ఆ తర్వాత ఒక సంవత్సరంలో ఒక జంటకి రెండు సార్లు పెళ్లి జరుగుతుంది. వీళ్ళ అదృష్టం చూడండని సుమలత అంటుంది. అసలు వీళ్ళ మధ్య నిజంగానే ఏం లేదా ఎందుకు ఇలా చేస్తున్నారని నందు అనుకుంటుంది. నందుకి ఎలాగైనా వాళ్ళ ఇద్దరి మధ్య ఎం లేదని అర్థం అయ్యేలా చెయ్యాలి... కృష్ణ అంటే అసహ్యం కలిగేలా చెయ్యాలి లేదంటే నందునే వాళ్ళని దగ్గర ఉండి ఒకటి చేస్తుందని ముకుంద అనుకుంటుంది. అందరూ కిందకి రాగానే.. ఆడవాళ్లు మగవాళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడుదాం ఎవరు గెలుస్తారో చూద్దామని గౌతమ్ అంటాడు. అందరూ దానికి సరే అంటారు. ఆ తర్వాత ఆడవాళ్లు మగవాళ్ళు రెండు గ్రూప్ లుగా విడిపోయి గేమ్ ని మొదలుపెడతారు. ఒక గ్రూప్ పొడుపు కథ అడగ్గానే వాటికి సమాధానం ఇంకొక గ్రూప్ చెప్పాలి. అలా కుటుంబం మొత్తం సరదాగా గడిపుతారు. కొన్ని రోజుల్లో ఈ కుటుంబాన్ని వదిలి వెళ్లిపోతున్నా ఈ సరదాలని మిస్ అవుతానని కృష్ణ అనుకుంటుంది. కృష్ణ ఒక పొడుపు కథ అడుగుతుంది. తాళి కడతారు.. మెట్టెలు పెడుతారు కానీ భార్యకాదు ఎవరని అడుగుతుంది. కృష్ణ మా విషయం దీంతో చెప్పేస్తుందా అని మురారి అనుకుంటాడు. ఆ పొడపు కథ కి ఎవరు సమాధానం చెప్పకపోవడంతో కృష్ణనే సమాధానం చెప్తుంది. దానికి సమాధానం పూజరి అని వివరిస్తుంది. కృష్ణకి నాపై ఏ అభిప్రాయం లేదని ఈ పొడుపు కథతో క్లియర్ అయిందని మురారి అనుకుంటాడు.
ఆ తర్వాత ఏంటి కృష్ణకి నిజంగానే మురారి అంటే ఇష్టం లేదా అని నందు అనుకుంటుంది. నేనే కృష్ణని తప్పుగా అర్థం చేసుకున్నానా కృష్ణకి మురారి అంటే ఇష్టం లేదా అని ముకుంద అనుకుంటుంది. రేవతి కూడా కృష్ణకి, మురారి అంటే ఇష్టం లేదా అనుకుంటుంది. ఆ తర్వాత అందరూ భార్యలకి వాళ్ళ భర్తలు మెహందీ పెడుతారు. కృష్ణకి మురారి మెహందీ పెడుతాడు. ఆ తర్వాత కృష్ణకి ముక్కు దురద గా ఉంటే.. కృష్ణ మెహందీతో ఇబ్బంది పడుతుంది. అప్పుడే మురారి వస్తాడు. హెల్ప్ చెయ్యండంటూ ముక్కుపై దురద వస్తుందని అంటుంది కృష్ణ. అప్పుడు కృష్ణకి మురారి దగ్గరగా వచ్చి రొమాంటిక్ గా చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.