English | Telugu
బిగ్ బాస్ లోకి జబర్దస్త్ బ్యూటీ తన్మయ్
Updated : Aug 8, 2023
తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోకి ప్రతీ సీజన్ లో మంచి రేటింగ్ దక్కుతోంది. .అయితే ఇప్పటికి ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు సీజన్ 7 ని త్వరలో తీసుకురాబోతోంది. దీనికి సంబంధించి లోగో ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతోంది. అలాగే ఈ న్యూ సీజన్ లో చాలా ట్విస్టులు కూడా ఉన్నాయని నాగార్జున చెప్పేసారు. ఈ నెలాఖరులోపు బిగ్ బాస్ కొత్త సీజన్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ హౌస్ లోకి వెళ్ళేవాళ్ళతో ఇప్పటికే మంతనాలు చేశారు. ఈ నేపథ్యంలో ఒక్కో పేరు వినిపిస్తోంది. ఐతే ఈ సీజన్ లోకి జబర్దస్త్ కమెడియన్ తన్మయ్ వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. `జబర్దస్త్` షో ఎంతో మంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ షోకి వచ్చి ఇప్పుడు జబర్దస్త్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అందులో కొంతమంది స్టార్స్ కూడా అయ్యారు.
అలాంటి వాళ్ళల్లో తనకంటూ ఒక ఓన్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న వారిలో తన్మయి ఒకరు. జనరల్‌గా ఈ కామెడీ షోలో అబ్బాయిలు అమ్మాయిల గెటప్స్ లో వచ్చి కామెడీ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అలా కామెడీ చేసే వారిలో తన్మయి కూడా ఒకరు. ఐతే ఈ తన్మయి గురించి చెప్పాలంటే నిజ జీవితంలో అబ్బాయి అని చెప్పింది. ఐతే తనలో అమ్మాయిల లక్షణాలు కనిపిస్తుండడంతో టెస్ట్ లు చేయించుకున్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్సు కారణంగా ఇలా జరుగుతూ ఉంటుందని డాక్టర్లు చెప్పారట. దీంతో తాను అమ్మాయిగా మారినట్లు గతంలో ప్రసారమైన `క్యాష్` ప్రోగ్రామ్‌లో కూడా చెప్పింది. ఈ మాటతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది తన్మయ్. ఐతే తన్మయ్ బిగ్ బాస్ 6 లోకి ఎంట్రీ ఇస్తుందంటూ అప్పట్లో చాలా ప్రచారం జరిగింది. కానీ వెళ్ళలేదు. ఇకపోతే ఇప్పుడు తన్మయ్ బిగ్ బాస్ 7 లోకి ఎంట్రీ ఇవ్వబోతోందంటూ ఒక లేటెస్ట్ అప్ డేట్ ని ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. బీబీ మేకర్స్ వెళ్లి తన్మయ్ ని అప్రోచ్ అయ్యారట. రెమ్యూనరేషన్ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. మరి చూడాలి ఈ సీజన్ లో తన్మయ్ వస్తుందా లేదా అని.