English | Telugu
రాజ్ ఇచ్చిన ఆఫర్ ని వద్దన్న కావ్య!
Updated : Aug 8, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'.ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -168 లో... కళ్యాణ్ ఎలాగైనా తన అభిమాన పాటకురాలి అడ్రెస్ కనుక్కోవాలని అనుకుంటాడు. అదే విషయం అప్పుతో చెప్పగా.. దీన్నే పిచ్చి అంటారని అంటుంది. అలా అనగానే కళ్యాణ్ డల్ అవుతాడు.
మరొక వైపు తన వాళ్ళ పుట్టింటివాళ్ళకి ఎలాగైనా హెల్ప్ చెయ్యాలని కావ్య ఆలోచిస్తుంది. అపర్ణ, రుద్రాణి అన్న మాటలు గుర్తుచేసుకుంటూ కావ్య బాధపడుతుంది. అప్పుడే డిజైనర్ గా ఆఫర్ లెటర్ తీసుకొని వస్తాడు రాజ్. నీకొక గుడ్ న్యూస్ అంటూ రాజ్ కావ్యకి ఆఫర్ లెటర్ ఇస్తుండగా.. తను వద్దని అంటుంది. నేను ఆ ఉద్యోగం చెయ్యలేనని కావ్య చెప్తుంది. ఇన్ని రోజులకి నీ కళని గుర్తించి, నీకు ఈ అవకాశం ఇస్తే ఇలా మాట్లాడుతున్నావేంటి.. నేనే నిన్ను బ్రతిమిలాడాలనుకుంటున్నావా అని రాజ్ అంటాడు. అదేం లేదు నన్ను క్షమించండి..
మీ ఆఫర్ ని తిరస్కరిస్తున్నానని కావ్య చెప్పేసి వెళ్ళిపోతుంది. వాళ్ళ మాటలన్ని ధాన్యలక్ష్మి వింటుంది. విన్నావా పిన్ని మీ కోడలు ఎలా మాట్లాడుతుందోనని రాజ్ అనగానే.. ఇంట్లో జరిగిందంతా రాజ్ కి చెప్తుంది ధాన్యలక్ష్మి. మరొక వైపు కావ్య ఆలోచిస్తుంటుంది. నాన్న వాళ్ళకి మాట ఇచ్చాను. ఇప్పుడు ఈ డబ్బులు ఎలా కట్టాలని కావ్య టెన్షన్ పడుతుంది. మరొక వైపు రాజ్ అపర్ణ దగ్గరికి వెళ్లి కావ్య గురించి మాట్లాడతాడు. కావ్యకి డబ్బు నేనేం ఊరికే ఇవ్వలేదు.. తను డిజైన్స్ బాగా వేస్తుంది. మిడిల్ క్లాస్ డిజైన్స్ గురించి కాంట్రాక్ట్ వచ్చినందుకు తాతయ్య నన్ను మెచ్చుకున్నారు కదా.. ఆ కావ్య వల్లే ఆ కాంటాక్ట్ వచ్చింది.
తనని డిజైనర్ గా మన కంపెనీ లో జాబ్ ఇచ్చి అందరి ముందు ఈ ఆఫర్ లెటర్ నీతో ఇప్పిద్దామనని అనుకున్న అని అపర్ణతో రాజ్ అంటాడు. ఆలా డబ్బులు తీసుకొని వెళ్లి ఇచ్చే సరికి నాకు కోపం వచ్చి తనతో అలా మాట్లాడాను. తనకి ఆ టాలెంట్ ఉన్నప్పుడు ఆఫీస్ కి వెళ్ళామను అని అపర్ణ చెప్పగానే.. రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు కావ్య తెలిసిన వాళ్ళకి ఏదైనా వర్క్ ఉందా అంటూ ఫోన్ చేస్తుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. మా అమ్మ నువ్వు ఆఫీస్ కి రావడానికి ఒప్పుకుందని చెప్తాడు. అయిన నేను ఈ జాబ్ చెయ్యను. మీ అమ్మ ఒప్పుకుంది కాబట్టి రమ్మంటున్నారు. వద్దంటే నేను ఆఫీస్ కి వెళ్ళాక, కొన్ని రోజులకు వద్దంటే అప్పుడు పరిస్థితేంటి.. మళ్ళీ ఇక్కడ డబ్బులు తీసుకొని నా పుట్టింటికి ఇస్తున్నా అని అంటారని కావ్య చెప్పగానే.. ఎవరేం అనకుండా నేను చూసుకుంటానని రాజ్ అంటాడు. అయిన కావ్య ఒప్పుకోదు.
ఆ తర్వాత కావ్యకి ఒకతను ఫోన్ చేస్తాడు. ఇందాక ఫోన్ చేసావ్ చూసుకోలేదు.. ఏంటి కాల్ చేసావని కావ్యని అడుగుతాడు. విగ్రహలు తయారు చేస్తానని కావ్య చెప్తుంది. నీ కోసం మీ ఇంటికి వెళ్ళాను నువ్వు లేవన్నాక ఆ కాంట్రాక్టు మీ నాన్నకి ఇవ్వలేదని అతను చెప్తాడు. నేను వస్తాను చేస్తానని కావ్య అనగానే.. అతను సరే మీ నాన్న కి అడ్వాన్స్ ఇస్తానని అంటాడు. మరొక వైపు స్వప్న దగ్గరికి రాహుల్ డ్రింక్ చేసి వస్తాడు. రాహుల్ మత్తులో ఉన్నాడు.. నా అబద్దపు కడుపును నిజం చేసుకోవాలని స్వప్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.