English | Telugu

గుడిలో ఉన్న దేవత గుండెల్లోకి వచ్చింది... ఐ లవ్ యు చెప్పిన ఖుష్బూ

ఎక్స్ట్రా జబర్దస్త్ షో ప్రతీ వారం కొత్త కొత్త స్కిట్స్ తో మంచిగా ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఈ వారం ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ఒక్కో స్కిట్ ఒక రేంజ్ లో నవ్వించాయి. ఇక ఈ వారం ఈ ప్రోమో చూస్తే గనక ఒక చిన్న ఝలక్ కనిపిస్తుంది. బులెట్ భాస్కర్ స్కిట్ అంటే చాలు జడ్జ్ కుష్బూకి చాలా ఇష్టం. బులెట్ భాస్కర్ తో కలిసి ఆమె డాన్స్ చేస్తారు. అతన్ని బాగా పొగుడుతారు కూడా..ఈ వారం కూడా అలాగే జరిగింది.

ఈ ప్రోమో లాస్ట్ లో భాస్కర్ స్కిట్ వచ్చింది. భాస్కర్ మంచి మెరుపుల డ్రెస్ తో కళ్లజోడుతో హీరోలా ఉంటాడు. ఇంతలో భాస్కర్ కి ఫోన్ వస్తే నాటి నరేష్ అటెండ్ చేసి అవతల వాళ్ళను తిట్టి పెట్టేస్తాడు. "ఎవర్రా" అని భాస్కర్ అడిగేసరికి "పెన్షన్ ఇచ్చేవాళ్లు" అని చెప్పేసరికి కుర్చీలోంచి లేచి నరేష్ చేతిలో సెల్ ని లాగేసుకున్నాడు. ఆతర్వాత భాస్కర్ కి యాక్సిడెంట్ అయ్యే సీన్ వస్తుంది. అతనికి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ గా దుర్గారావు రోల్ కామెడీగా ఉంది. భాస్కర్ కి ట్రీట్మెంట్ ఇస్తూనే "భాస్కర్ గారండీ..మీకు మన ఖుష్బూ మేడం గారికి లవ్ ట్రాక్...అదే.. అదే" అని నోరు జారేసాడు. ఆ మాటలకు భాస్కర్ లేచి దుర్గారావుని కొట్టాడు. ఇలా ఈ స్కిట్ ని చూసిన జడ్జ్ ఖుష్బూ "ఐ లవ్ యు భాస్కర్ గారు" అని చెప్పారు. "ఐ లవ్ యు సో మచ్ మేడం" అని రిప్లై కామెంట్ ఇచ్చాడు భాస్కర్.

"భాస్కర్ గారు ఇంతకూ మీ స్పందన ఏమిటి" అని రష్మీ అడిగేసరికి "గుడిలో ఉన్న దేవత గుండెల్లోకి వచ్చినట్టు ఉంది" అనేసరికి ఖుష్బూ వేళ్ళతో హార్ట్ సింబల్ వేసి చూపించారు. భాస్కర్ కళ్ళల్లో మెరుపు చూసాక సత్య, రష్మీ కలిసి హార్ట్ సింబల్ చూపించారు. నెటిజన్స్ " జడ్జ్ కి కంటెస్టెంట్ కి ట్రాక్ పెట్టారా..ఎం కర్మరా బాబు..." అని కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఈ వారం ఎక్స్ట్రా జబర్దస్త్ ఎంటర్టైన్ చేయబోతోంది.