English | Telugu
కావ్య వాళ్ళింటికి వెళ్ళకుండా ఆపాలని చూసిన రాజ్!
Updated : Aug 16, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -175 లో.. కావ్య కావాలనే సీతరామయ్య దృష్టిలో పడి.. ఇంకా మీ పుట్టింటికి వెళ్లలేదా అని అడగాలని కావ్య సీతరామయ్య ముందే తిరుగుతుంటుంది. అప్పుడే రాజ్ నిద్ర లేచి వచ్చి హాల్లో కూర్చొని కావ్యని చుస్తాడు. ఇదేదో ఫిట్టింగ్ పెట్టేలా ఉందని రాజ్ అనుకుంటాడు.
ఆ తర్వాత తాతయ్య గారు.. మీకు ఏదైనా అవసరం ఉంటే పిలవండి కిచెన్ లోనే ఉంటా వర్క్ చేసుకుంటూ అని కావ్య అనగానే.. అదేంటి మీ ఇంటికి వెళ్లట్లేదా అని సీతరామయ్య అడుగుతాడు. లేదు తాతయ్య ఈ రోజు మంచి రోజు కాదట అని రాజ్ అంటాడు. నీతో చెప్పినవాడు ఎవడు ఈ రోజు మంచి రోజని సీతరామయ్య అంటాడు. సరే ఈ రోజే వెళ్తుందని సీతరామయ్యకి రాజ్ చెప్పి.. కావ్యని గదిలోకి తీసుకొని వెళ్తాడు. కావాలని ఇదంతా చేస్తున్నావని రాజ్ అనగానే.. అదేం లేదని మీరు వెళ్ళమంటే వెళ్తానని, లేదంటే లేదని కావ్య అంటుంది. నీ పర్ఫార్మన్స్ చాలు. వెళ్లి రెడీ అవ్వని కావ్యతో రాజ్ అంటాడు. ఆ తర్వాత రాజ్ శ్రీనివాస్ కి ఫోన్ చేసి కాంట్రాక్టు మళ్ళీ కృష్ణమూర్తికి ఇవ్వని చెప్తాడు. శ్రీనివాస్ సరే అంటాడు. రాజ్ శ్రీనివాస్ తో కాంటాక్ట్ గురించి మాట్లాడింది స్వప్న విని కావాలనే రాహుల్ దగ్గరికి వెళ్లి రాజ్ కి వినపడెలా.. మా చెల్లి కావ్యని రాజ్ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని ఇప్పుడు తనకి నచ్చింది చేస్తున్నాడని, కావ్య చెప్పినట్లు వింటున్నాడని స్వప్న అనగానే నువ్వేం మాట్లాడుతున్నావని రాహుల్ అంటాడు. స్వప్న మాటలు విన్న రాజ్ ఇంట్లో అందరూ ఆ కావ్య చెప్పినట్లు వింటున్న అనుకుంటున్నారా అని అనుకుంటాడు. మరొక వైపు కళ్యాణ్, అప్పు ఇద్దరు అనామిక నెంబర్ కోసం ట్రై చేస్తూనే ఉంటారు.
ఆ తర్వాత రాజ్ ఎలాగైనా కావ్యని బయటకు పంపించకుండా చెయ్యాలని అనుకోని కావ్య స్నానం చేసి వచ్చేసరికి నేల మీద నూనెని పోస్తాడు. కావ్య బాత్రూం నుండి బయటకు వచ్చి కింద ఉన్న నునెని చూసి దాటుకొని వస్తుంది. నన్ను వెళ్లకుండా చేయడానికి నూనె పోశారు కదూ అని కావ్య అంటుంది. నేనే పోశాను అనడానికి సాక్ష్యం ఉందా అని రాజ్ అనగానే, ఉంది.. మీకు నేను పుట్టింటికి వెళ్లడం ఇష్టం లేదు అందుకే ఏదైనా చేస్తారని డౌట్ వచ్చి నా ఫోన్ వీడియో ఆన్ చేసి పెట్టానని రాజ్ నూనె పోసిన వీడియోని రాజ్ కి చూపిస్తుంది. ఇంత ముందు చూపేంటని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.