English | Telugu

మన్మధుడితో బ్రహ్మముడి సీరియల్ భామలు!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ బ్రహ్మముడి సీరియల్ గత ఏడు వారాల నుండి టీఆర్పీలో మొదటి స్థానంలో ఉంటూ వస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సీరియల్ కి ఇప్పుడు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. అంతలా ఆకట్టుకుంటుంది ఈ సీరియల్. తాజాగా కావ్యని అర్థం చేసుకుంటు రాజ్ అండగా ఉంటున్నాడు. ప్రెగ్నెంట్ కావాలని స్వప్న తాపత్రయపడుతుంది. కళ్యాణ్ తన అభిమాన పాఠకురాలి కోసం అప్పుతో కలిసి వెతుకుతున్నాడు. ఇలా ఈ సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది.

బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ గా మానస్, కావ్యగా దీపిక రంగరాజు, స్వప్నగా హమీద‌, కనకంగా నీప, రుద్రాణిగా షర్మిత గౌడ, అపర్ణగా శ్రీప్రియ, అప్పుగా నైనిశా, ధాన్యలక్ష్మిగా మాధురి, కళ్యాణ్ గా కిరణ్ కాంత్ నటిస్తున్నారు. అయితే ఈ సీరియల్ ని కుమార్(చింటు) పంతం డైరెక్టర్ చేస్తున్నాడు. గుప్పెడంత మనసు సీరియల్ ని కూడా కుమార్ పంతం డైరెక్ట్ చేస్తుండటం విశేషం. రెండు సీరియల్స్ కి విభిన్న కథలని రాసుకుని వాటిని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు కుమార్ పంతం.

బ్రహ్మముడి సీరియల్ లో ఒక్కో పాత్రకి ఒక్కో ప్రత్యేకతను చూపిస్తూ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు డైరెక్టర్ కుమార్ పంతం‌. ఈ సీరియల్ లో దుగ్గిరాల ఫ్యామిలీ ధనవంతులుగా, కనకం-కృష్ణమూర్తిల ఫ్యామిలీ మధ్యతరగతి కుటుంబంగా కనిపిస్తుంటారు. దుగ్గిరాల వారసుడు రాజ్(మానస్) ని కనకం-కృష్ణమూర్తిల పెద్ద కూతురు స్వప్న(హమీద) కి ఇచ్చి పెళ్ళిచేద్దామని అనుకుంటే.. స్వప్న పెళ్ళిపీటల మీద నుండి రాహుల్ తో లేచిపోతుంది‌. దాంతో స్వప్న స్థానంలో.. కనకం తన రెండవ కూతురు కావ్యని పెళ్ళిపీటల మీద కూర్చోబెట్టి పెళ్ళి జరిపిస్తుంది‌. దాంతో రాజ్ వాళ్ళ అమ్మ కావ్యని కోడలిగా అంగీకరించదు. ఆ తర్వాత స్వప్న (హమీద) ప్రెగ్నెంట్ అని చెప్పి రాహుల్ ని పెళ్ళిచేసుకుంటుంది. ఇప్పుడు అప్పు, కళ్యాణ్ ఇద్దరు కలిసి తన కవితలని ఇష్టపడే అభిమాన పాఠకురాలి కోసం వెతుకుతున్నారు.

అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే లిస్ట్ లో బ్రహ్మముడి సీరియల్ నటీనటులు ముందుంటారు. షర్మితా(రుద్రాణి) ఎప్పుడు బోల్డ్ ఫోటోలతో ట్రెండింగ్ లో ఉంటుంది. నైనిషా(అప్పు) రీల్స్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. అలాగే ధాన్యలక్ష్మి(మాధురి) రీల్స్ , ఫోటోలతో ట్రెండింగ్ లో ఉంటుంది. అయితే తాజాగా తను ఈ సీరియల్ డైరెక్టర్ కుమార్ పంతంతో కలిసి దిగిన ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి అందరికి ట్యాగ్ చేసింది. మన్మధుడితో బ్రహ్మముడి భామలు అంటూ పెట్డిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఈ పోస్ట్ కి మానస్(రాజ్).. పట్డు పట్టు నువ్వెంత కాకాపట్టిన నో డైలాగ్స్ నో చేర్ అని కామెంట్ చేశాడు. దాంతో ఇది మరింత ఫన్ ని క్రియేట్ చేసింది.