English | Telugu

బీర్ తాగడం అలా అలవాటు అయ్యింది..ఇప్పుడు రోజూ రెండు పెగ్గులు తాగుతా

"శుభలేఖ సుధాకర్" క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోలకు ఫ్రెండ్‌ రోల్స్ లో గొప్ప గొప్ప పాత్రల్లో నటించి ఫుల్ ఫేమస్ అయ్యాడు. కమల్ హాసన్, అర్జున్ నటించిన "ద్రోహి" మూవీలో సుధాకర్ యాక్షన్ ని అస్సలు మర్చిపోలేము. రీసెంట్ గా ‘వకీల్ సాబ్’ మూవీలో చేసింది చిన్న పాత్రే ఐనా మంచి పేరు వచ్చింది.. అలాగే ‘రామబాణం’ మూవీలో కూడా కీలక పాత్ర పోషించారు. జడ్జిగా, బాబాగా, తాతగా ఇలా అనేక రకాల పాత్రలు సుధాకర్‌ని వరిస్తున్నాయి. 1999 తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకున్నశుభలేఖ సుధాకర్.. మళ్లీ 2004లో ‘ఆ నలుగురు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘భీష్మ’, ‘వకీల్ సాబ్’ మూవీస్ మంచి గుర్తింపుని ఇచ్చాయి.

అలాంటి సుధాకర్ ఒక ఇంటర్వ్యూలో తాను ఎన్ని పెగ్గులు వేస్తారో చెప్పారు. "బీర్లు బాగా తీసుకునేవారట..నిజమా" అని అడిగేసరికి "ఆ రోజుల్లో నేను బీర్ తాగింది ఒళ్ళు రావడం కోసం కాదు. నేను అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్ళినప్పుడు ఉదయం పూట అందరూ నాతో బాగానే ఉండేవారు. సాయంత్రం 6 దాటితే ఎవరూ నాతో మాట్లాడేవారు కాదు..నాకు లోన్లీ ఫీలింగ్ వచ్చేది. ఒక టైంలో అందరూ నన్ను అవాయిడ్ చేస్తుంటే నేను ఎవరినన్నా ఏమన్నా అన్నానా అనే గిల్టీ ఫీలింగ్ ఉండేది. సరే అని నేను నా ఫ్రెండ్స్ ని అడిగితే నువ్వు మందు తీసుకోవు కదా నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు అనేసరికి అయ్యో అలాంటిదేమీ లేదు అని ఒక స్పూన్ తాగాను. తర్వాత ఒక గ్లాస్, ఒక మగ్గు, ఒక బాటిల్ తాగమన్నారు అలా అలవాటైపోయింది...ఇప్పుడు నేను రోజూ రెండు పెగ్గులు తీసుకుంటున్నాను....బ్లాక్ లేబిల్ విస్కీ తాగుతాను...నా డ్రింక్ నా ఫ్రెండ్, నా ఫిలాసఫర్, నా గైడ్, మై బాయ్ ఫ్రెండ్, మై గర్ల్ ఫ్రెండ్ " అని చెప్పారు...ఇక సుధాకర్ నటించిన ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రంలో ఆయన చేసిన తాత పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. రీఎంట్రీతో శుభలేఖ సుధాకర్ మంచి అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నారు.