English | Telugu

నిజం చెప్పకుండా నందుని కట్టిపడేసిన మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -236 లో.. కృష్ణ డ్రెస్ లో రావడం చూసిన ప్రసాద్.. నువ్వు ఈ డ్రెస్ లో చూడడానికి బాగానే ఉన్నా, మా కృష్ణ చీర లోనే మాకు అందరికి నచ్చుతావని అంటాడు. మీరందరు నాపై ఇంత అభిమానం పెంచుకున్నరా అని కృష్ణ మనసులో అనుకుంటుంది. సక్సెస్ ఫుల్ గా నీ క్యాంపుని పూర్తి చేసి రా కృష్ణ అని భవాని అంటుంది.

మరొకవైపు కృష్ణ వెళ్లేలోపల మురారి ప్రేమ విషయం చెప్పాలని నందు అనుకుంటుంది. నువ్వు మురారిని అబ్సర్వ్ చెయ్యి.. నేను కృష్ణకి మురారి ప్రేమ విషయం చెప్తాను. లేదంటే కృష్ణకి తన ప్రేమ విషయం మురారి చెప్పనివ్వడని గౌతమ్ తో నందు చెప్తుంది. ఆ తర్వాత అందరూ టిఫిన్ చెయ్యడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. ఈ రోజు మనమందరం కలిసే తిందామని కృష్ణ అంటుంది. మోచేయి మలవకుండా తినాలని కృష్ణ చెప్తుంది. అదేలా అని అందరూ కృష్ణని అడుగుతారు. ఎలాగో నేను చూపిస్తానని కృష్ణ అంటుంది టిఫిన్ ని రేవతి కి తినిపిస్తుంది. ఇలా ఒకరికొకరు తినిపించుకోవాలని కృష్ణ చెప్పగానే అందరూ ఒకరికిఒకరు తినిపించుకుంటారు. ఇది బాగుంది రోజు ఇలాగే చేద్దామని సుమలత అంటుంది. మరొక వైపు గదిలో కృష్ణ, మురారి ఉంటారు. అప్పుడే కృష్ణకి నిజం చెప్పడానికి నందు వస్తుంది. మురారి ఉన్నాడు ఎలా చెప్పాలని అనుకుంటునే లోపలికి వచ్చి కృష్ణకి మురారి ప్రేమ విషయం చెప్పే ప్రయత్నం నందు చేస్తుంది. కృష్ణ నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని నందు అడుగుతుంది. నందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు.. నువ్వు చిన్న పిల్లవి అని మురారి అంటాడు. నందు ఏం చెప్పాలని అనుకుంటావని కృష్ణ అంటుంది. ఏం లేదని మురారి అంటాడు. కృష్ణ కోపంగా గదిలో నుండి లగేజ్ తీసుకొని బయటకు వస్తుంది. నందు నువ్వు కృష్ణకి ఎందుకు చెప్తున్నావని మురారి అంటాడు. లేదు నేను ఇప్పుడు కృష్ణకి నీ ప్రేమ విషయం చెప్పాలని నందు అంటుంది.

ఆ తర్వాత నందు ఎలాగైనా కృష్ణకి నిజం చెప్పి కృష్ణ వెళ్లకుండా నందు చేస్తుందని మురారి అనుకొని తన నోటికి ప్లాస్టర్ వేసి చేతులు కట్టివేస్తాడు. మురారి ఆ తర్వాత గదిలోపల ఉంచి బయట గడియ పెడుతాడు. మరొకవైపు కృష్ణ వెళ్తు అందరికి జాగ్రత్తలు చెప్తుంది. టైమ్ కి తిను జాగ్రత్తగా ఉండు, నీకేం ప్రాబ్లెమ్ అయిన నాకు ఫోన్ చెయ్యి అని కృష్ణకి‌‌ రేవతి చెప్తుంది. కృష్ణ భవాని దగ్గరికి వెళ్లి ఎమోషనల్ అవుతుంది.. ఆ తర్వాత మధుని కృష్ణ పిలిచి.. నువ్వు ఇది నేను వెళ్లిపోయాక ఇంట్లో వాళ్ళకి ప్లే చేసి చూపించని ఒక పెన్ డ్రైవ్ ఇస్తుంది. అందులో ఏముందని రేవతి అడుగుతుంది. మీ కుకింగ్ వీడియోస్ అని కృష్ణ అనగానే.. తింగరి పిల్ల అని రేవతి నవ్వుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.