English | Telugu

పేపర్ లో వచ్చింది చూసి రిషి చేసిన పరిష్కారం అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -842 లో.. మహేంద్ర, జగతిల దగ్గరికి శైలేంద్ర వచ్చి పేపర్ లో DBST కాలేజీ గురించి నెగెటివ్ గా వచ్చిందని చెప్తాడు. అయితే ఇప్పుడేమంటావని మహేంద్ర అనగా.. ఈ కాలేజీని ఎవరైన అప్పగించండని శైలేంద్ర అంటాడు. ఎవరికి అప్పగించాలి, నీకు అప్పగించాలా.‌. అది మా కంఠంలో ప్రాణం ఉండగా జరగదని మహేంద్ర అంటాడు. ఇది రిషి కట్డుకున్న సామ్రాజ్యమని జగతి అంటుంది. ఇది ఇలానే సాగితే కాలేజీ మూసేల్సి వస్తుందని శైలేంద్ర అనగానే.. శైలేంద్ర కొట్టడానికి మహేంద్ర చేతిని లేపుతాడు. అన్నయ్య కోసం ఆగిపోయా.. రిషిని చంపాలని చూసింది నువ్వేనని మాకు తెలుసు‌‌.‌ అన్నయ్యకి నిజం తెలిసేలా చేస్తానని మహేంద్ర అనగానే శైలేంద్ర షాక్ అవుతాడు. పేపర్ లో వచ్చినదానికి వెనుక నువ్వే ఉన్నావని నాకు తెలుసు, ఆధారాలు సేకరించి నిరూపిస్తానని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత శైలేంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

రిషి ఒంటరిగా ఉండటం చూసిన వసుధార.. ఏం అయింది సర్ డల్ గా ఉన్నారని అడుగగా.. నా వ్యక్తిగతం అని రిషి అంటాడు. అక్కడ జగతి మేడమ్ ఏం చేయలేకపోతుంది. ఎంతో మంది DBST కాలేజీ పతనమవ్వాలని ఎదురుచూస్తున్నారని వసుధార అనగానే.. జగతి మేడమ్ మీద నాకు పూర్తి నమ్మకం ఉందని రిషి అంటాడు. అక్కడ DBST కాలేజీకి సమస్య మీరే ఆలోచించాలి సర్ అని వసుధార అనగానే.. నేను ఏం చేయాలని రిషి అంటాడు. DBST కాలేజీకి వెళ్ళి స్టుడెంట్స్ అడ్మిషన్ స్ట్రెంత్ ని పెంచాలని వసుధార అనగానే.. నేను DBST కాలేజీకి వెళ్ళను. కానీ ఇక్కడ నుండి ఆ పని చేయగలనని వసుధారతో రిషి చెప్పేసి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత పాండియన్ ని రమ్మని పిలిస్తాడు రిషి. పాండియన్ రిషి దగ్గరికి వచ్చాక.. సర్ రమ్మన్నారంటా అని అడుగగానే.. అవును, మనం పవర్ ఆఫ్ స్టడీస్ తరపున ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామని చెప్తాడు. గొప్ప కాలేజీలలో చదువుకోలేక చాలా మంది ఉంటారు. వారిని మీరంతా ఒక్కొక్కరు ఒక్కరు లేదా ఎక్కువ మందిని జాయిన్ చేయాలి. వారికి నాణ్యమైన చదువుని అందజేయాలని రిషి చెప్తాడు. దాంతో పాండియన్ సరేనని చెప్తాడు. ఆ తర్వాత రిషి ఇంటికి వస్తాడు. ఏంజిల్ హాల్లో కూర్చొని ఆలోచిస్తుంటుంది. పెళ్ళిచేసుకోవాలని చెప్పిన విశ్వనాథ్ గురించి ఆలోచిస్తుంటుంది ఏంజిల్. రిషి చూసి పరధ్యానంలో ఉన్నావని అంటాడు. ఏం లేదని ఏంజిల్ అంటుంది. విశ్వనాథ్ గురించి మీరు మర్చిపోండి.. ఆయన గురించి నేను చూసుకుంటానని రిషి అనగానే.. సరేనని ఏంజిల్ అంటుంది. తిన్నారా అని ఏంజిల్ ని రిషి అడుగుతాడు. లేదని అనగా తిను తొందరగా అని రిషి అంటాడు. పదా ఇద్దరం తిందామని ఏంజిల్ అనగా‌‌.. వద్దు నాకు తినాలని లేదు నువ్వు తినేసెయ్ అని చెప్పేసి రిషి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.