English | Telugu
ఆడవాళ్లు పాడైపోతున్నారు..సిగరెట్, మందు తాగుతున్నారు
Updated : Aug 16, 2023
"సుమ అడ్డా షో నెక్స్ట్ " వీక్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి బెదురులంక 2012 టీం నుంచి కార్తికేయ, నేహా శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, డైరెక్టర్ క్లాక్స్ వచ్చారు. "ఇండస్ట్రీకి ముందొచ్చింది మీరే కదా" అని సుమ శ్రీకాంత్ అయ్యంగార్ ని అడిగేసరికి "కాదు ఇండస్ట్రీకి ముందొచ్చింది మీరు" అన్నారు శ్రీకాంత్. "నాకంటే ఇండస్ట్రీకి ముందే వచ్చి నేను ఇండస్ట్రీలో ఏం చేస్తున్నానో చూస్తూ ఆ తర్వాత ఎంటరయ్యారు..నిజం చెప్పండి " అని సుమ అనేసరికి "కాదమ్మా నేను చెప్పింది ఇండస్ట్రీకంటే నువ్వు ముందొచ్చావ్" అని చెప్తున్నా అన్నారు శ్రీకాంత్.
తర్వాత ఒక స్టూడెంట్ వచ్చి "ఈమధ్య ఆడవాళ్లు పాడైపోతున్నారు..సిగరెట్ తాగుతున్నారు, మందు తాగుతున్నారు" అనేసరికి "ఆ కుర్చీని మడత పెట్టి" అనే డైలాగ్ బ్యాక్ గ్రౌండ్ లో వినిపించేసరికి ఆ స్టూడెంట్ అక్కడి నుంచి పారిపోయాడు. ఇంతలో హీరోయిన్ రాధికా అలియాస్ నేహా శెట్టి వచ్చి "కుర్చీ వ్వాట్" అని అడిగింది. "కొన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకోకు నువ్వు...నాలాగా ఉండడం నేర్చుకో.. అన్నీ తెలుసుకున్న తెలియనట్టు ఉంటాను కదా నాలాగా అన్నమాట" అని కామెడీగా చెప్పింది. తర్వాత కార్తికేయ గులాబీలు తీసుకొచ్చి రాధికాకు ప్రొపోజ్ చేసాడు "ఈ గులాబీలకు ముళ్ళు లేనట్టే నా లవ్ కి కూడా ముళ్ళుండవు" అని చెప్పాడు. "అంటే సంబంధం ఖాయం చేసేసినట్టేనా బాబు " అని అడిగింది సుమ. "అసలే మీ అమ్మాయి కత్తిలా ఉంటుంది కదా " అందుకే అని అన్నాడు. "వాళ్ళ నాన్న గడ్డపారలా ఉంటాడు" అని చెప్పింది సుమ. తర్వాత "ఆకు చాటు పిందె తడిసె" అనే సాంగ్ కి నేహా శెట్టి, కార్తికేయ ఇద్దరూ కలిసి డాన్స్ చేశారు. ఇక చివరికి ఇమేజెస్ చూపించి గేమ్ ఆడించింది సుమ.