English | Telugu

తన భార్యకి అమ్మాయిలాగా ఉండడం నేర్పిస్తున్న రోహిత్ !

మెరీనా, రోహిత్ సాహ్ని.. బుల్లితెర సీరియల్స్ చూసే ప్రేక్షకులకు సుపరిచితమే. మెరీనా అబ్రహం గోవాలోని క్రిస్టియన్ ఫ్యామిలీలో‌ జన్మించగా.. రోహిత్ ని పెళ్ళి చేసుకొని హైదరాబాద్ లో ఉంటుంది. అప్పట్లో జీ తెలుగులో ప్రసారమయైన 'అమెరికా అమ్మాయి' సీరియల్ లో కళ్యాణిగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. రోహిత్ కూడా సీరియల్స్ లో నటించాడు. నీలి కలువలు, అభిలాష సీరియల్స్ తో పాపులర్ అయ్యాడు. రోహిత్-మెరీనా ఇద్దరు కలిసి 'డ్యాన్స్ జోడి డ్యాన్స్' లో కూడా పాల్గొన్నారు.

అలా బుల్లితెరపై ఫేమస్ అయిన వీరిద్దరికి బిగ్ బాస్ లో 'రియల్ కపుల్' కోటాలో అవకాశం లభించింది. మెరీనా రోహిత్ బిగ్ బాస్ లో జంటగా అడుగుపెట్టి.. ఇద్దరు మంచి ప్రవర్తనతో ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. అయితే రోహిత్ ని ఫ్యామిలీ మ్యాన్ అని అంటారు. రోహిత్ లోని డీసెంట్ నెస్, కూల్ అండ్ కామ్ ప్రవర్తన వల్ల బిగ్ బాస్ సీజన్-6 లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకడిగా నిలిచాడు. బిగ్ బాస్ నుండి వచ్చాక బిబి జోడీలో కూడా డ్యాన్స్ చేశారు. అయితే వీరిద్దరు తమ డాన్స్ తో అందరిని అంతగా మెప్పించలేకపోయారు. దాంతో బిబి జోడి నుండి ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లో రోహిత్ భార్యపై చూపించే ప్రేమ కేరింగ్ కి అందరూ ఫిదా అయ్యారు. దాంతో అతడికి ఫ్యాన్ బేస్ పెరిగింది.

రోహిత్ సోషల్ మీడియాకి ఎప్పుడు దూరంగా ఉంటాడు. కానీ మెరీనా ఎప్పటికప్పుడు తమకి సంభందించిన విషయాలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. అయితే మెరీనా, రోహిత్ కలిసి తాజాగా ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, వీడీయోగ్రఫీ స్టుడియోని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఎప్పుడో ఒకసారి కూడా సోషల్ మీడియాలో కన్పించని రోహిత్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేసాడు. తన భార్య మెరీనాకి అమ్మాయి ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలని టిప్స్ ఇస్తున్నాడు. అదంతా ఒక వీడియాగా చేసి తన ఒన్ స్టాగ్రామ్ లో షేర్ చేసాడు రోహిత్. కాగా ఇప్పుడు ఈ జంట చేసే రీల్స్ ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.