English | Telugu

మెహబూబ్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!

మెహబూబ్.. ఒకవైపు డ్యాన్స్, మరొకవైపు జిమ్ లో వర్కవుట్ లు చేస్తూ సిక్స్ ప్యాక్స్ తో కనిపిస్తుంటాడు. బిబిజోడీలో శ్రీసత్యతో కలసి జోడికట్టి అదరహో అనిపించేలా డ్యాన్స్ చేశాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మెహబూబ్.. ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాడు.

మెహబూబ్ హైదరాబాద్ లో పుట్టాడు. అనేక షార్ట్ ఫిల్మ్ లలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇతనొక యూట్యూబర్, నటుడు, డ్యాన్సర్. అందరు ఇతడిని మెహబూబ్ దిల్ సే అని పిలుచుకుంటారు. కరోనా లాక్ డౌన్ టైమ్ లో ఇతడు చేసిన టిక్ టాక్ లకి ఫుల్ క్రేజ్ వచ్చింది. దాంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. అలాగే మెహబూబ్ ఒక యూట్యూబ్ ఛానెల్ ని కూడా స్టార్ట్ చేశాడు. అందులో అతని రీల్స్, వ్లాగ్స్ అన్నింటిని షేర్ చేయగా అన్నీ అత్యధిక వీక్షకాధరణ పొందుతున్నాయి. బిగ్ బాస్ సీజన్-4 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తనదైన శైలితో గేమ్స్ ఆడి, టాస్క్ లు పూర్తిచేసి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ తర్వాత అతడికి పలు సినిమాల్లో అవకాశం వచ్చింది. జబర్దస్త్ లో కూడా అప్పుడప్పుడు మెరిసి తనలోని కామెడీని కూడా పరిచయం చేశాడు. ఇలా మల్టీ ట్యాలెంట్ గా ఉన్న మెహబూబ్ సెలబ్రిటీ రేంజ్ ని పొందాడు. కాగా ప్రస్తుతం తన ఇన్ స్టాగ్రామ్ లో 999K ఫాలోవర్స్ ని కలిగి ఉన్నాడు. అటు యూట్యూబ్ లో పద్నాలుగు లక్షల సబ్ స్క్రైబర్స్ ఉన్నారు.

మెహబూబ్ వాళ్ళ అమ్మమ్మకి ఆరోగ్యం బాగోలేకపోవడంతో తన ఫ్యామిలీ అంతా కలిసి ఉన్న ఒక ఫోటోఫ్రేమ్ ని తీసుకొచ్చి చూపించగా.. తను ఎంతగానే హ్యాపీగా ఫీల్ అయింది. వాళ్ళందరూ కలిసి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళంట.. రెండు సంవత్సరాల క్రితం దిగిన ఫోటోని ల్యామినేట్ చేసి తీసుకొచ్చాడు మెహబూబ్. ఇదంతా తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో వీడియోగా పోస్ట్ చేశాడు మెహబూబ్. మనకి బిజీ షెడ్యూల్ ఎలా ఉంటుందో తెలుసు, డబ్బుల కోసం, మన లక్ష్యం కోసం మనం నిరంతరం పరిగెడుతుంటాం. కానీ కనీసం కొంత సమయం మన ఫ్యామిలీ కోసం కేటాయించండి. వారి ఆరోగ్యం గురించి టైమ్ టూ టైమ్ చూసుకోండి అంటూ ఈ పోస్ట్ కి జోడించాడు మెహబూబ్.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.