English | Telugu

నందు, గౌతమ్ ల మీద డౌట్ పడిన భవాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -237 లో.. కృష్ణ ఇంట్లో నుండి వెళ్లిపోతు అందరికి జాగ్రత్తలు చెప్తుంది. భవాని దగ్గర కృష్ణ ఆశీర్వాదం తీసుకుంటుంది. అందరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందామని కృష్ణ అంటుంది. మధు సెల్ఫీ తీస్తుండగా నందు ఎక్కడ అని గౌతమ్ అడుగుతాడు. నందు టాబ్లెట్స్ వేసుకోవడానికి వెళ్ళిందని మురారి చెప్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి సెల్ఫీ తీసుకుంటారు.

ఆ తర్వాత ఫోటో గ్రాఫర్ వచ్చి కృష్ణకి ఫొటోస్ ఇస్తాడు. ఈ ఫోటోలు ఎందుకు ఆల్బమ్ చేయిస్తున్నాం కదా అని కృష్ణని భవాని అడుగుతుంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతాను కదా అందుకే ఈ ఫోటోస్ తెప్పించుకున్న అని కృష్ణ అంటుంది. నువ్వు క్యాంపుకి పదిరోజులు మాత్రమే వెళ్తున్నావ్? ఎందుకు ఇంత హడావుడి అని భవాని అంటుంది. ఆ తర్వాత కృష్ణ ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టి వెళ్తున్నా అని ఎమోషనల్ గా ఇంటి నుండి బయల్దేరుతుంది. మరొక వైపు నందు డోర్ తియ్యండంటూ అరుస్తుంది. అప్పుడే భవాని వెళ్లి డోర్ తీస్తుంది. నిన్ను ఎవరు లోపల ఉంచి బయట గడియపెట్టారని నందుని భవాని అడుగుతుంది. నేనే పెట్టాను అత్తయ్య.. లోపల నందు ఉన్నది చూడలేదని గౌతమ్ అంటాడు. నేను వాష్ రూమ్ వాడుకోవడానికి లోపలికి వెళ్ళాను వచ్చేలోపు గౌతమ్ డోర్ పెట్టినట్టున్నాడని నందు అంటుంది. వాళ్ళిద్దరు చెప్పింది భవాని విని.. మీరు అబద్ధం చెప్తున్నట్లు అనిపిస్తుందని అంటుంది. లేదు అత్తయ్య నిజమే చెప్తున్నామని గౌతమ్ అంటాడు. కృష్ణ బ్యాగ్ కీ నా దగ్గరే ఉంది వెళ్లి ఇచ్చేసి వస్తానని నందు, గౌతమ్ లు బయలుదేరి వెళ్తారు. ఆ తర్వాత భవాని.. వీళ్ళు ఏదో నాకు అబద్ధం చెప్తున్నారా అని ఆలోచిస్తుంది.

మరొకవైపు ఇదంతా నీ వల్లే.. మురారి విషయం కృష్ణకి చెప్పేటప్పుడు నా పక్కనే ఉండమాని చెప్పాను కదా అని గౌతమ్ పై నందు కోప్పడుతుంది. కృష్ణ నెంబర్ నీ దగ్గర ఉంటే ఫోన్ చెయ్ అని గౌతమ్ అనగానే.. నందు ఫోన్ లో ఛార్జింగ్ ఉండదు. మరొక వైపు నందుకి అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి చెప్పాను.. తను అసలు నమ్మట్లేదని కృష్ణతో మురారి చెప్తాడు. ఆ తర్వాత కృష్ణకి నందు వాయిస్ మెసేజ్ చేస్తుంది. " నువ్వు వెళ్లిపోకు కృష్ణ.. నువ్వంటే మురారికి బాగా ఇష్టం" అని మెసేజ్ చేస్తుంది. మరొక వైపు కృష్ణ ఎమోషనల్ అవుతుంది. ఇంట్లో అందరని నేను మోసం చేశానని అనుకుంటారు. మన అగ్రిమెంట్ గురించి ఇంట్లో ఎవరికి చెప్పకుండా నన్ను ఇంట్లో వాళ్ళ దృష్టిలో మోసం చేసిందని అనుకునేలా చేశారని మురారితో కృష్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.