English | Telugu

శ్రీజతో ఘనంగా మానస్ ఎంగేజ్‌మెంట్!

'బ్రహ్మముడి' సీరియల్ లో నటిస్తున్న రాజ్ అలియాస్ మానస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ షోలోకి వెళ్ళొచ్చాక మంచి క్రేజ్ లో ఉన్నాడు మానస్. ఒకవైపు సీరియల్, మరొకవైపు ప్రైవేట్ ఆల్బమ్స్ తో బిజీ గా ఉన్నాడు. స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్ అత్యంత ప్రేక్షకధారణ పొందిన సీరియల్ అనడంలో ఆశ్చర్యం లేదు. మానస్ ఆ సీరియల్ లో రాజ్ పాత్రలో మెప్పిస్తున్నాడు.

రాజ్ చిన్నప్పటి నుండి యాక్టింగ్ మీద ఇంట్రస్ట్ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని మొదలుపెట్టాడు‌. రాజ్ మధ్యలో సినిమాలకి బ్రేక్ ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో మంచి ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో బిజీ గా ఉంటున్నాడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు ప్రియాంక సింగ్ తన చుట్టూ తిరిగినా అసలు పట్టించుకోకుండా, తన గేమ్ తను ఆడుతూ ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు మానస్. అంతే కాకుండా విష్ణుప్రియతో ప్రైవేట్ అల్బమ్స్ చేశాడు. 'జరి జరి పంచే కట్టు', 'గంగులు' పాటలకి మిలియన్స్ లలో వ్యూస్ వచ్చాయి. అయితే మానస్ ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో అందరికి తెలుసు. తన తల్లికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో, బిగ్ బాస్ లో ఉన్నప్పుడు చాలా సందర్భాలల్లో చెప్పుకొచ్చాడు.

తాజాగా మానస్ తన దగ్గరి బంధువు అయిన శ్రీజతో ఎంగేంజ్ మెంట్ చేసుకున్నాడు. త్వరలోనే శ్రీజని పెళ్లి చేసుకోనున్నాడు. సన్నిహితులు, బంధువుల మధ్య గ్రాంఢ్ గా మానస్, శ్రీజ ల ఎంగేజ్ మెంట్ జరిగింది. దానికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మానస్ కి బిగ్ బాస్ ఫ్రెండ్స్ అయిన కాజల్, విజే సన్నీ ఇద్దరు తమ ఇన్ స్టాగ్రామ్ లలో రాజ్ కి విషెస్ ని తెలియజేశారు‌. రాజ్ తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో ' ఏంగేజ్డ్' అని పోస్ట్ చేశాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.