English | Telugu

సర్ప్రైజ్ ఇచ్చిన అనూజా...షాకైన అవినాష్

ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెర మీద జబర్దస్త్ కమెడియన్ గా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాడు. అక్కడ కూడా ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసాడు. అవినాష్ శ్రీముఖి మంచి ఫ్రెండ్స్..వీళ్ళ కాంబినేషన్ చాలా షోస్ లో కనిపిస్తూనే ఉంటుంది. ఇక శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్ లో శ్రీముఖితో పాటు అవినాష్ కూడా చేస్తూ ఉంటాడు. అలాంటి అవినాష్ మ్యారేజ్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఇక భార్య అనూజా కూడా చాలా షోస్ లో ఇప్పటికే కనిపించింది. అలాంటి ఆమె ఇప్పుడు గర్భిణిగా ఉండడంతో ఆమె తన పుట్టింటికి వెళ్ళింది. అక్కడ తల్లి సమక్షంలో గడుపుతోంది.

ఈటీవీలో త్వరలో  తులసి పేరుతో ఒక కొత్త సీరియల్

ఈటీవీలో త్వరలో "తులసి" పేరుతో ఒక కొత్త సీరియల్ పట్టాలెక్కబోతోంది. ఈ సీరియల్ లో మెయిన్ లీడ్ గా యమునా నటిస్తున్నారు. యమునా ఈ సీరియల్ టైటిల్ "తులసి" పేరుతో లీడ్ రోల్ లో నటించబోతున్నారు. ఈటీవీలో ఒకప్పుడు యమునా సీరియల్స్ సూపర్ డూపర్ హిట్టయినవి ఎన్నో ఉన్నాయి. "అన్వేషిత, విధి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మౌనపోరాటం" వంటి సీరియల్స్ లోని పాత్రలకు ఆమె ప్రాణం పోశారు. అలాగే ఐశ్వర్య హీరోయిన్ గా నటిస్తోంది. ఐశ్వర్య గతంలో "కృష్ణ తులసి" సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్ బాగా పరిచయమే. అందులో "శ్యామా" రోల్ ఐశ్వర్యకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

బిగ్ బాస్ కి వెళ్లకపోవడమే మంచిది..కరాటే కళ్యాణి కామెంట్స్ వైరల్

మూవీస్ ద్వారా, బిగ్ బాస్ షో ద్వారా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కాంట్రావర్సీల ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకుంది కరాటే కళ్యాణి. ఐతే ఈమె  బిగ్ బాస్ సీజన్ 7 గురించి కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు.  బిగ్ బాస్ షోను ఆపాలని చాలామంది కోరుతూ  కోర్టులో పిటిషన్లు వేస్తారు. వాటిని పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదన్నారు.  "బిగ్ బాస్ వల్ల మంచి ఉంది, చెడు కూడా ఉంది. బిగ్ బాస్ సీజన్ కి వెళ్లొచ్చాక అందరూ ఖాళీ ఐపోతారు. ఎందుకంటే వాళ్ళు ఆరు నెలలు ఆపేస్తారు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక ఆ క్రేజ్ తో బిగ్ బాస్ అనుకుంటారు కానీ ఆ ఆరు నెలల తర్వాత వాళ్ళు వీళ్ళను మర్చిపోతారు.  

పవర్ అస్త్ర చేతిలో బిగ్ బాస్ సీజన్ 7 పవర్

కొన్ని నెలల నుంచి ఊరిస్తూ వస్తున్న బిగ్ బాస్  సీజన్ 7  గ్రాండ్ లాంచ్ ఐపోయింది. ఇందులో 14 మంది కంటెస్టెంట్స్ ఒక రేంజ్ లో వాళ్ళ వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ తో ఆడియన్స్ ని పలకరించారు.  "టార్ మార్ టక్కర్ మార్" సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగ్ మీరెంతైనా   ఊహించుకోండి మీ ఊహకు అందని సీజన్  7 ఉల్టా ఫుల్టా అని చెప్పారు. ఇప్పటివరకు మీరు చూసిన ఆట వేరు ఇప్పుడు  మీరు చూడబోయే ఆట వేరు అంటూ ఒక రేంజ్ షో గురించి ఇంట్రో చెప్పారు. ఐతే హౌస్ లోకి వచ్చిన ఏ కంటెస్టెంట్ కూడా కంఫర్మ్ కాదని క్లారిటీ ఇచ్చారు. ఈ హౌస్ లో స్పెషల్ గా "పవర్ అస్త్ర" పేరుతో ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు..

నటరాజ్ మాష్టర్ ని అవమానించిన సుమ...భార్యను ఈడ్చుకుంటూ వెళ్లిపోయిన మాష్టర్

సుమ అడ్డా షో కొన్ని వారాలుగా ప్రశాంతంగా అలా కూల్ గా నడిచిపోతోంది. ఎలాంటి కాంట్రోవర్సి అనేది లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ వారం షో కాంట్రోవర్సి అయ్యేట్టుగానే ఉంది. సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి ఆట సందీప్, జ్యోతిరాజ్, నటరాజ్, నీతూ ఎంట్రీ ఇచ్చారు. ఇక  వీళ్ళతో గేమ్స్ కూడా ఆడించింది. డాన్సులు చేయించింది. ఇక ఫైనల్ గా ఒక సెగ్మెంట్ పెట్టింది సుమ. అదే "వెల్కమ్ టు సుమతో డాన్స్ టునైట్ " అని అనౌన్స్ చేసేసరికి సందీప్, నటరాజ్ మాస్టర్స్ ఇద్దరూ కలిసి పోటాపోటీగా డాన్స్ ఇరగదీసేసారు.

వాళ్ళ గది దగ్గరికి తీసుకెళ్ళిందనగానే రేవతి షాక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -253 లో.. కృష్ణ మురారిల జోలికి రాకూడదని కోపంగా చెప్తే వినట్లేదు ప్రేమగా చెప్పాలని రేవతి అనుకొని.. ముకుందని ప్రేమగా పలకరిస్తుంది. ఆ తర్వాత ముకుందని రేవతి పక్కకి తీసుకొని వెళ్లి మాట్లాడుతుంది. నువ్వు కృష్ణ, మురారీల జోలికి రాకు. వాళ్ళని సంతోషంగా ఉండనివ్వు. నీ ప్రేమని కృష్ణకి చెప్పకని రేవతి అంటుంది. కానీ ముకుంద వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదు. ఎలాగైనా తన ప్రేమని దక్కించుకుంటానని, అలాగే కృష్ణకి ప్రేమ విషయం చెప్తానని ముకుంద చెప్తుంది. ముకుంద మొండిగా మాట్లాడేసరికి రేవతికి కోపం వచ్చి.. నువ్వు కనుక కృష్ణకి మీ ప్రేమ సంగతి చెప్తే నేను చూస్తూ ఊరుకోనంటూ రేవతి వార్నింగ్ ఇస్తుంది.