English | Telugu
శైలేంద్ర అగ్రిమెంట్ తో వాళ్ళకి వచ్చే సమస్యేంటి!
Updated : Sep 3, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -858 లో.. వసుధార దగ్గరికి రిషి వెళ్లి.. ఏంటి ఆటిట్యూడ్.. ఆ ప్రిన్సిపాల్ సర్ నా దగ్గరికి వచ్చి సిలబస్ గురించి డిస్కషన్ చెయ్యమని చెప్పారంట రాలేదు అని రిషి వసుధారపై అరుస్తాడు. మీరు ఏదో ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు డిస్టబ్ చేయడమని రాలేదని వసుధార చెప్తుంది.
ఆ తర్వాత వసుధారని క్యాబిన్ లో కొన్ని పేపర్స్ తీసుకొని రమ్మని రిషి పంపిస్తాడు. వసు రిషి క్యాబిన్ కి వెళ్లి.. తన కళ్ళని డ్రా చేసి ఉంది చూసి మురిసిపోతుంది. అప్పుడే రిషి వచ్చి కోపంగా.. చేతిలో నుండి అది లాక్కుంటాడు. మీకు చెప్పిన పని మాత్రమే చెయ్యండని వసుధారపై రిషి కోప్పడతాడు. సర్ కి ఇంకా నాపై ప్రేమ ఉందని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత నేను ఏంజిల్ కి సరిపోనని తనకి తెలిసేలా మీరే చెయ్యాలి అని వసుధారని అడుగుతాడు రిషి. చేస్తాను ఏంజిల్ హెల్ప్ అడిగింది చేశాను, మీక్కూడా చేస్తానని వసుధార చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రిషి డ్రా చేసిన వసుధార కళ్ళని చూస్తుంటాడు. వసుధార చాటు నుండి చూసి.. మీ డ్రాయింగ్ బాగుందని చెప్పి వెళ్ళిపోతుంది. డ్రాయింగ్ బాగుందేంటీ, బాగుంది కళ్ళు అని రిషి అనుకుంటాడు. మరొక వైపు జగతి, మహేంద్ర ఇద్దరు దేవయాని దగ్గరికి వచ్చి.. లాకర్ లో ఉన్న నా గోల్డ్ ఇవ్వమని జగతి అడుగుతుంది. అయిన ఇప్పుడు గోల్డ్ ఎందుకు అని అన్నీ ఆరా తీస్తుంది దేవయాని.. నాకు అవసరం ఉంది ఇవ్వండని జగతి అడుగుతుంది. అయిన దేవయాని అన్ని అడుగుతుంటుంది. అప్పుడే ఫణింద్ర వచ్చి.. ఏమైంది అని అడగ్గానే దేవయాని చెప్తుంది. ఇప్పుడు గోల్డ్ ఎందుకని ఫణింద్ర కూడా అడుగుతాడు. జగతి, మహేంద్ర ఇద్దరు సైలెంట్ గా ఉండడంతో శైలేంద్ర కలుగజేసుకొని.. జరిగిందంత చెప్తాడు... గోల్డ్ తాకట్టు పెట్టి సాలరీస్ ఇవ్వడానికి అడుగుతాన్నారు అనగానే.. ఇంత జరిగితే నాకు ఎందుకు చెప్పలేదు గోల్డ్ పెట్టడం కరెక్ట్ కాదు, అంత డబ్బు ఇప్పుడు ఎలా సర్దుబాటు అవుతుందని ఫణింద్ర అంటాడు. నేను సర్దుబాటు చేస్తాను. ఒక ఛాన్స్ ఇవ్వండి అని శైలేంద్ర అనగానే ఫణింద్ర సరే అంటాడు..
మరొక వైపు సౌజన్య రావుని శైలేంద్ర కలిసి ఏదో అగ్రిమెంట్ రెడీ చేసి తీసుకురమ్మని అంటాడు. ఆ తర్వాత ఫణీంద్రకి శైలేంద్ర కాల్ చేసి.. డబ్బులు ఇవ్వడానికి మా ఫ్రెండ్ ఒప్పుకున్నాడని అంటాడు. అది విని అవునా.. నిజమేనా అని ఫణీంద్ర అంటాడు. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి డబ్బులు తీసుకొమని చెప్తున్నాడని శైలేంద్ర అనగానే.. ముందు మనకి ప్రాబ్లమ్ క్లియర్ కావడం ముఖ్యం, ఆ అగ్రిమెంట్ పూర్తి చేసుకొని డబ్బులు తీసుకొని రా అని శైలేంద్రతో ఫణింద్ర చెప్తాడు. అగ్రిమెంట్ ఏంటని జగతి, మహేంద్ర ఇద్దరు టెన్షన్ పడుతారు. ఆ తర్వాత ఈ అగ్రిమెంట్ ద్వారా కాలేజీ నీనుండి నాకు వస్తుందని సౌజన్యరావుతో శైలేంద్ర చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.